Breaking News

Birthright citizenship : ట్రంప్‌ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట

Published on Fri, 01/24/2025 - 13:39

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)కు తొలి షాక్‌ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. దీంతో జన్మతః పౌరసత్వం చట్ట రద్దుతో బెంబేలెత్తుతున్న భారతీయులకు (NRI) భారీ  ఊరట లభించింది.  

జన్మహక్కు పౌరసత్వాన్ని (birthright citizenship) రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును గురువారం యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి  నిలిపివేశారు. "ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు" అని న్యాయమూర్తి జాన్ కఫ్‌నౌర్ పేర్కొన్నారు.  అయితే ట్రంప్ దీనిపై "అప్పీల్" చేయాలని  యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ట్రంప్ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?
ఫిబ్రవరి 19 తర్వాత ఆ ఉత్తర్వు తేదీ నుండి 30 రోజుల తర్వాత యుఎస్‌లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే 14వ సవరణ యొక్క ఈ కొత్త వివరణ వర్తిస్తుంది.

ట్రంప్ ఆదేశంఅమలులోకి వస్తే ఏటా 1.5 లక్షలకు పైగా నవజాత శిశువులకు పౌరసత్వం నిరాకరించబడుతుందని డెమొక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు నివేదించాయని రాయిటర్స్ తెలిపింది.

ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది?
అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గంగా ఉపయోగించే బర్త్‌రైట్‌ సిటిజెన్‌షిప్‌ రద్దు భారతీయ కుటుంబాలపై చాలా ప్రభావం పడుతుంది. ట్రంప్ ఆదేశం అమల్లోకి వస్తే,  ఎన్‌ఆర్‌ఐ పిల్లలు అమెరికాలో ఉండేందుకు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దాదాపు 5.2 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారుల గ్రూప్‌గా  ఉన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత సంవత్సరం ప్రచురించిన మరో నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది అనధికార భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా వేసింది. ఇది 2018లో 4.8 లక్షలలో సగం కంటే తక్కువ.

జనవరి 20న,  47వ యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం  చేసిన  ట్రంప్‌  వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులతీసుకొస్తానన్న వాగ్దానం చేసిన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వు ప్రకారం, పత్రాలు లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్ పౌరసత్వానికి అర్హులు కారు.కాగా  1868 నుంచేఅమెరికాలో ఈ చట్టం అమల్లో ఉంది.దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్ధుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. 
 

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)