విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?
Breaking News
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి
Published on Thu, 07/18/2024 - 12:40
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కెయిర్న్స్ సమీపంలోని ప్రముఖ స్విమ్మింగ్ స్పాట్ మిల్లా మిల్లా జలపాతం వద్ద ఘటన జరిగింది.
బాధితులను బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బగా గుర్తించారు. వీరిద్దరూ మరో స్నేహితుడితో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ముగ్గురూ మంగళవారం మిల్లా మిల్ వాటర్ ఫాల్స్ చూసేందుకు స్నేహితుడితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో కాలుజారి ఒకరు జలపాతంలో పడిపోవడంతో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడు ఒడ్డుకు చేరుకున్నాడు. చైతన్య, సూర్యతేజ అకాల మరణం వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది.
Tags : 1