Breaking News

కెనడాలో భారతీయ విద్యార్థి మృతి

Published on Sun, 04/14/2024 - 17:22

అమెరికాలో జరిగిన వరస భారతీయ విద్యార్థుల మృతి ఘటనలు మరువక మునుపే మరో విషాదకర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. కెనడాలోని సౌత్‌ వాంకోవర్‌కి చెందిన భారత విద్యార్థి తన ఆడి కారులోనే శవమై కనిపించాడు. గుర్తు తెలియని దుండగలు అతడిపై కాల్పులు జరిపినట్లు సౌత్‌ వాంకోవర్‌ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు  ఈస్ట్‌ 55 అవెన్యూ నుంచి తమకు సమాచరం వచ్చిందని చెప్పారు. బాధితుడు చిరాగ్‌ ఆంటిల్‌(24)గా గుర్తించారు అధికారులు.

వాంకోవర్‌ పోలీసులు ఇంకా అనుమానితులని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. అగంతకుల ఆచూకీకై దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలిపారు. బాధితుడి సోదరుడు రోనిత్‌ ఉదయం చిరాగ్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని, తాను మాట్లాడానని చెప్పాడు. అయితే అతడు ఆడి కారు తీసుకుని ఎక్కడకో వెళ్లాడు. అప్పుడే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదనగా చెప్పాడు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి సోషల్‌ మీడియా వేదికగా ఎక్స్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ విద్యార్థి కుటుంబానికి సహాయం చేయాలని అభ్యర్థించారు.

ఈ విషాదకర ఘటనపై తక్షణమే స్పందించి.. దర్యాప్తు వేగంవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చేయాలని ఎక్స్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు చౌదరి. కాగా, చిరాగ్‌ కుటుంబం అతడి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కౌండ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ గోఫండ్‌ ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక చిరాగ్‌ యాంటిల్‌ సెప్టెంబరు 2022లో వాంకోవర్‌కి వచ్చారు. అతను ఇటీవలే యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ పూర్తి చేసి వర్క్‌ పర్మిట్‌  పొందాడని అన్నారు. 
 

(చదవండి: ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)