Breaking News

‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్‌ యువతి బైక్‌ రైడ్‌ వీడియో వైరల్‌

Published on Fri, 08/04/2023 - 19:44

శ్రీనగర్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ కశ్మీర్‌ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్‌ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్‌ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 

ఇక, కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్‌ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్‌ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్‌ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్‌ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్‌ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్‌ రూల్స్‌ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: నోర్మూయ్‌, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్‌ లొళ్లి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)