Breaking News

ఆశ్రమంలో ఇద్దరు చిన్నారులు మృతి.. 10 మంది పరిస్థితి విషమం

Published on Tue, 07/02/2024 - 11:13

మధ్యప్రదేశ్‌లోని మహ్లార్‌గంజ్‌లో గల యుగపురుష్‌ ధామ్‌(ఆశ్రమం)లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రక్తంలో ఇన్ఫెక్షన్‌ కారణంగా వీరు మృతి చెందారని తెలుస్తోంది. ఆశ్రమానికి చెందిన మరో 10 మంది చిన్నారులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని సమాచారం. యుగపురుష్‌ ధామ్‌ ఆశ్రమంలో ఉంటున్న కరణ్‌, ఆకాశ్‌ మృతి చెందారు.

12 ఏళ్ల కరణ్‌ దేవాస్‌ జిల్లా సోన్‌కచ్చా నివాసి. 15 నెలల క్రితం అతనిని అధికారులు ఆశ్రమంలో చేర్పించారు. అలాగే ఏడేళ్ల ఆకాశ్‌ను మూడు నెలల ‍క్రితం ఆశ్రమంలో చేర్పించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం కరణ్‌ అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇదేవిధంగా మంగళవారం ఉదయం ఆకాశ్‌ మృతి చెందాడు.

ఆశ్రమ పర్యవేక్షకులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమంలోని కృష్ణ అనే బాలుడు తొలుత ఇన్ఫెక్షన్‌కు గురయ్యాడు. ఆ తరువాత ఆ బాలుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. అయితే ఆ తరువాత ఆశ్రమంలోని మిగిలిన చిన్నారులు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు చిన్నారులు ఈ ఆశ్రమానికి వచ్చి చదువులు సాగిస్తుంటారు. 2006లో 78 దివ్యాంగ చిన్నారులతో ఈ ఆశ్రమం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఆశ్రమంలో 2017 మంది చిన్నారులు ఉన్నారు.

కలెక్టర్‌ ఆశీష్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు డయారేయాతో, మరో బాలుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)