Breaking News

ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్': అమిత్‌ షా

Published on Wed, 11/26/2025 - 13:20

న్యూఢిల్లీ: ముంబైలో 26/11 దాడుల ఘటనకు 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ, భారత్‌ అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్ పాలసీ’ని మరోమారు స్పష్టం చేశారు. 2008 నవంబర్ 26 రాత్రి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా, ముంబై నగరంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత 60 గంటల పాటు వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటనలో మొత్తం 166 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్‌లోని యూదు కేంద్రం, కామా హాస్పిటల్, మెట్రో సినిమా, లియోపోల్డ్ కేఫ్‌లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. హోంమంత్రి అమిత్ షా తన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో ‘2008లో  ఇదే రోజున, ఉగ్రవాదులు ముంబైపై దాడి చేసి, దారుణమైన, అమానుషమైన చర్యలకు పాల్పడ్డారు’ అని పేర్కొన్నారు. ఈ దాడులను ధైర్యంగా ఎదుర్కొంటూ, తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమిత్‌ షా నివాళులు అర్పించారు.
 

ఉగ్రవాదంపై భారతదేశ స్పష్టమైన వైఖరిని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం ఒక దేశానికే కాదు, మొత్తం మానవాళికే శాపం అని  అమిత్‌షా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానం స్పష్టంగా ఉందని, దీనిని ప్రపంచమంతా అభినందిస్తోందని, భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాలకు విస్తృత మద్దతు అందుతోందని హోంమంత్రి పేర్కొన్నారు. కాగా ఈ దాడుల తర్వాత, ఒకరు తప్ప మిగిలిన ఉగ్రవాదులందరూ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్‌కు 2010లో మరణశిక్ష విధించారు.  రెండేళ్ల తర్వాత పూణే జైలులో కసబ్‌కు ఉరితీశారు.

ఇది కూడా చదవండి: రాజ్యాంగం జాతీయవాద మార్గదర్శి: రాష్ట్రపతి ముర్ము

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)