Breaking News

10 ఏళ్లు ఇన్ఫీ మూర్తి చెప్పిన దానికి మించి చాకిరీ కానీ, టెకీ ఆవేదన

Published on Mon, 07/20/2026 - 17:11

హైదరాబాద్‌కు చెందిన ఒక సీనియర్ టెక్నాలజీ ప్రొఫెషనల్ అర్జున్ సింగ్ (పేరు మార్పు) ఆవేదన నెట్టింట వైరల్‌గా మారింది.   ప్రముఖ కన్సల్టింగ్ దిగ్గజం డెలాయిట్ (Deloitte) సంస్థలో పదేళ్ల పాటు నారాయణ మూర్తి చెప్పిన దానికంటే ఎక్కువ  గంటలు పనిచేసినా,  తీవ్రమైన మానసిక ఒత్తిడి తప్ప ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని వాపోయారు. చివరకు కంపెనీ నుండి బయటకు వచ్చేశారు.

ఆయన తన ఉద్యోగ జీవితంలోనిఈ చేదు అనుభవాలను మనీకంట్రోల్‌తో పంచుకున్నారు. దీని ప్రకారం ఇన్‌ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే అర్జున్ సింగ్ తాను అంతకంటే ఎక్కువగా, వారానికి కొన్నిసార్లు 74 గంటల పాటు పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇంత కష్టపడి పనిచేసినా, తనకు రావాల్సిన ప్రమోషన్ దక్కకపోగా.. కేవలం 5 శాతం జీతం పెంపు (Salary Hike) మాత్రమే లభించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  దీంతో ఇది  సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది.

తీవ్ర ఒత్తిడి
చదువు పూర్తి కాగానే డెలాయిట్‌లో చేరిన అర్జున్, తన కెరీర్ మొత్తం అక్కడే కొనసాగించాలనుకున్నారు. కానీ కాలక్రమేణా ఆయన కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. విపరీతమైన పని ఒత్తిడి భరించలేనిదిగా మారింది. ముఖ్యంగా సాధారణంగా ఆరు నెలల పాటు ఆరుగురు చేయాల్సిన ప్రాజెక్ట్‌లను, పోటీ తట్టుకునే క్రమంలో కేవలం నలుగురు ఉద్యోగులతో ఐదు నెలల్లోనే పూర్తి చేయాలని యాజమాన్యం ఒత్తిడి తెచ్చేది. క్లయింట్ పనులతో పాటు ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్, కొత్త ప్రపోజల్స్ తయారు చేయడం వంటి అదనపు బాధ్యతలను ఉద్యోగులపై మోపేవారు. హోదా పెరిగేకొద్దీ ఈ ఉచిత పనుల భారం మరింత ఎక్కువయ్యేది. 

కంపెనీలు మారే చాలా మందిలా కాకుండా, తాను డెలాయిట్‌ను విడిచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని సింగ్ చెప్పారు. యంగస్టర్‌గా  ఉన్నపుడు సీనియర్ నాయకులను చూసి, ఒక రోజు తాను కూడా ఆ స్థాయికి చేరుకోగలను అనుకోవడం చాలా సులభం. ​కానీ  ఒక చోట చేరిన మొదటి రోజే 10 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించు కోకూడదన్నారు. అలాగే  తన నిర్ణయం ఏదో ఒక ప్రాజెక్ట్ వల్లనో, లేదా ఒక కష్టమైన మేనేజర్ వల్లనో మార్పు రాలేదు, అది క్రమంగా జరిగింని చెప్పారు. అయితే ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, డెలాయిట్‌లో గడిపిన దశాబ్దం గురించి తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదనికూడా స్పష్టం చేశారు.

 ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్‌ఫామెన్స్‌ బాలేదని పెయిడ్‌ లీవ్‌ : కంపెనీకి భారీ క్రేజ్‌

ఫ్యామిలీ జీవితానికి దూరం
ఆఫీస్ గంటలు ముగిసినా, పండగలు లేదా శుభకార్యాల్లో ఉన్నా సరే ఎప్పుడూ పనికి అందుబాటులో ఉండాల్సి వచ్చేది. పని నుండి డిస్‌కనెక్ట్ అవ్వడం అసలు సాధ్యపడేది కాదంటూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదని వాపోయారు. అర్జున్ మాటల్లో చెప్పాలంటే... "బాగా కష్టపడి అద్భుతంగా పనిచేసే వారికి, అలాగే నార్మల్‌గా పనిచేస్తూ లైఫ్ ఎంజాయ్ చేసే వారికి ఇచ్చే జీతాల పెంపులో పెద్దగా తేడా ఉండేది కాదు. మనం ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు రానప్పుడే ఉద్యోగి మానసికంగా కుంగిపోతాడు ." కోట్లాది రూపాయల విలువైన క్లయింట్ ప్రపోజల్స్‌ను రాత్రింబవళ్లు కూర్చొని టెక్నికల్ టీమ్ సిద్ధం చేస్తే, దానివల్ల వచ్చే లాభాల్లో వారికి ఎలాంటి వాటా దక్కేది కాదని ఆయన విమర్శించారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ జిప్‌లైన్ రైడ్‌ ప్రమాదం, 40 అడుగుల ఎత్తునుంచి..!

కొత్త జీవితం వైపు అడుగులు
అలా టాక్సిక్‌ వాతావరణం మధ్య  35 ఏళ్ల వయసులో  22 ఏళ్ల వయసులో తనకు ఉన్న సక్సెస్ డెఫినిషన్ ఇప్పుడు మారి పోయిందని గ్రహించానని చెప్పారు. డబ్బు కంటే కూడా తన సమయం, మానసిక ప్రశాంతత ముఖ్యమని భావించి డెలాయిట్‌కు రాజీనామా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మరో కంపెనీలో చేరాననీ అక్కడ డెలాయిట్ కంటే మంచి ప్యాకేజీ రావడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితానికి, ఆఫీస్ జీవితానికి మధ్య సరైన సమతుల్యత (Work-Life Balance) లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌ ఆత్మహత్య
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)