Breaking News

2029కల్లా మహిళా కోటా అమలు చేయాలి

Published on Sun, 07/19/2026 - 05:21

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా ఈ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్న వాదనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీస్‌ జారీ చేసింది. 

న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవ ల ఈ మేరకు విచారణ చేపట్టింది. డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా 2001 లేదా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ చట్టం–2002 కింద మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని (రాజ్యాంగ 128వ సవరణ చట్టం–2023) అమల్లోకి తెచ్చేలా కేంద్రానికి మార్గనిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది యోగమాయ ఎం.జి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

అలా ముడిపెడితే ఫలితం సున్న 
చట్టం ఆమోదం పొందినా 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల సేకరణ, తదనంతర డీలిమిటేషన్‌ ప్రక్రియతో దీని అమలును ముడిపెట్టడం వల్ల చట్టం నిరుపయోగంగా మారిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో లోక్‌సభ సీట్ల పెంపు, దేశవ్యాప్త డీలిమిటేషన్‌కు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026 వీగిపోయిన నేపథ్యంలో ఈ పిల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)