Breaking News

ఎల్‌కేజీ ఫ్రెండ్‌ను దగ్గర చేసిన ఇన్‌స్టాగ్రామ్‌

Published on Sun, 06/04/2023 - 13:26

చిన్ననాటి స్నేహితులను ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. అయితే ఒక్కోసారి స్నేహితులను విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోవడమో లేక మరో స్కూలుకు మారడమో లాంటివి జరుగుతుంటాయి. అటువంటి సందర్భాల్లో చిన్నారుల స్నేహాలు దూరమవుతుంటాయి. అయితే ఒక యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని వెదికి పట్టుకుంది. నేహా అనే ఈ యువతి తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో తన కథను వీడియో రూపంలో వివరించింది.

తాను తన లోవర్‌ కేజీ స్నేహితురాలిని వెదికేందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ రూపొందించానని తెలిపింది. దీనిసాయంతో తన బాల్య స్నేహితురాలిని వెదికానని వెల్లడించింది. వీడియోలో నేహ తెలిపిన వివరాల ప​్రకారం 2006లో తన స్నేహితురాలు లక్షితతో పాటు ఎల్‌కేజీ చదివానని పేర్కొంది. అయితే లక్షిత తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి షిఫ్ట్‌ అవడంతో తమ స్నేహం తెగిపోయిందని తెలిపింది. తనకు తన స్నేహితురాలి పూర్తిపేరు కూడా తెలియదని,అయితే తన రూపం, స్నేహం గుర్తుకు వస్తుండటంతో ఆమెను ఎలాగైనా వెదకాలని అనుకున్నానని తెలిపారు.

ఇందుకోసం తాను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ రూపొందించానని అన్నారు. దానిలో తన స్కూలు గ్రూపు ఫొటో పోస్ట్‌ చేశానని తెలిపారు. తరువాత తాను లక్షిత పేరుతో గల వేల అకౌంట్లను వెదికానన్నారు. వారికి మెసేజ్‌లు చేస్తూ, ఫొటోలను చెక్‌ చేశానని తెలిపారు. ఎట్టకేలకు తన స్నేహితురాలు లక్షిత నుంచి రిప్లయ్‌ వచ్చిందని ఆనందంగా తెలిపారు. తాము 18 ఏళ్ల తరువాత కలుసుకుని మాట్లాడుకున్నమని అన్నారు. దీనిని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు.

ఇప్పుడు తన స్నేహితురాలు జైపూర్‌లో ఉన్నదని తెలిసిందన్నారు. నేహ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేహా తన స్నేహితురాలిని కనిపెట్టేందుకు అనుసరించిన విధానం నచ్చిందని, తాము కూడా తమ బాల్య స్నేహితులను ఇలానే వెదికి తీరుతామని తెలిపారు. మరొక యూజర్‌ సోషల్‌ మీడియా అద్భుతాలు చేస్తున్నదని పేర్కొన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)