Breaking News

తమిళనాడులో షాకింగ్‌ ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసి..

Published on Sun, 09/07/2025 - 11:01

కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుతి  సమీపంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి.. దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

‘‘నువ్వు కుక్కతో సమానం’’ అంటూ బాధితురాలిని ఓ మహిళ అసభ్యకరంగా తిడుతుండగా, మరొకరు కర్రతో దాడి చేశారు. మరొ మహిళ ఆమె జట్టుపట్టుకుని లాగుతూ.. బాధితురాలి జాకెట్‌ను చించివేసింది. ఒక మహిళ ఈ దాడిని వీడియో తీస్తూ.. ఇలా చేస్తే జైలుకెళ్తారంటూ హెచ్చరించినా కూడా మిగతా వారు పట్టించుకోలేదు. సమారు 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఫుటేజ్‌ వైరల్‌గా మారింది. ఈ  ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు మహిళలో ఒకరు అరెస్టు కాగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.

భూ వివాదం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)