Breaking News

లేబర్‌ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్‌ వీడియో

Published on Wed, 11/12/2025 - 17:55

మహిళ జీవితంలో బిడ్డకు జన్మనివ్వడం అంటే  మరో జన్మ ఎత్తినంత పనే. ఈ సమయంలో గర్భిణీకి అటు అత్తింటివారు, ఇటు పుట్టింటి వారు చాలా అండగా ఉంటారు.  ప్రసవం పూర్తయి, తల్లీ బిడ్డ  క్షేమంగా ఉండే దాకా చాలా ఆందోళన పడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రసూతి వార్డులో జరిగిన ఒక సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. 

పురుటి నొప్పులతో బాధపడుతున్నకోడల్ని ఓదార్చి, ధైర్యం చెప్పాల్సిన అత్తగారు దారుణంగా ప్రవర్తించింది. దీనిపై గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది .ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగింది.

వారణాసి నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రికి  మహిళ ప్రసవం కోసం వచ్చింది. సహజం ప్రసవంకావాలని పట్టుబడుతూ కోడలిపై అరవడం మొదలు పెట్టింది.  "నోరు మూసుకో, లేకపోతే మూతి పగలగొడతా అంటూ బెదిరించింది. ఇదంతా జరుగుతున్నపుడు, బాధిత మహిళ భర్త, ఇతర కుటుంబ  సభ్యులు అక్కడే ఉన్నారు.  కొంత వాగ్వాదం, కోడలి పరిస్థితి చూసిన తరువాత వారు సిజేరియన్‌కు అనుకూలంగా ఉన్నారు. కానీ అత్తగారు మాత్రం సహజ ప్రసవానికి  పట్టుబడుతుండటం ఈ వీడియోలో చూడవచ్చు. "ఇలా ఏడుస్తూ ఉంటే తల్లి ఎలా అవుతావు?" అంటూ మండిపడింది. తన అంతేకాదు భార్య చేయి పట్టుకున్న కొడుకుని వారించింది. ఇతర కుటుంబ సభ్యులు ఆమెను శాంతింప జేయడానికి ప్రయత్నించినా ఆమె ధోరణికి అడ్డుకట్ట పడలేదు. మొత్తానికి ఆపరేషన్‌ లేకుండానే, సహజంగానే పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ  ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సమయంలో ఆమెతో ప్రేమగా  ఉండాలి
ఈ సంఘటనపై స్పందిస్తూ, గైనకాలజిస్ట్ డాక్టర్ నాజ్ ఫాతిమా, ఆమె మొదట ఏదో తమాషా చేస్తోందిలే అనుకున్నా.. కానీ ఇలాంటి  పరిస్థితులలో, కుటుంబం గర్భిణీ స్త్రీని ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవాలి. అనునయంతో, ఓదారుస్తూ మాట్లాడాలి కదా అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

నెటిజన్లు స్పందన
పెద్దవాళ్లు తోడుగా ఉండాలి గానీ ఇలా ప్రవర్తించకూడదు, ఇంత మొరటుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ పరిస్థితిలో ఆమెకు ధైర్యం చెప్పాలి అని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. నా  పగవాళ్లకి కూడా ఇలాంటి అత్తగారు ఇలా ఉండాలని కోరుకోను, ఈ సమయంలో  కూడా కొడుకు తన భార్య చేతులు పట్టు కోవడం ఆమె భరించలేకపోతోంది అని మరొకరు వ్యాఖ్యానించారు.  అయ్యో.. ఆమె అలా  అరుస్తోంటే, భర్త ఏంటి ఏమీ మాట్లాడడు, భార్య కోసం స్టాండ్‌ తీసుకోవాలి కదా  అంటూ మరొకరు మండిపడ్డారు. 

ఇదీ చదవండి: లోయర్‌ బెర్త్‌.. సీనియర్‌ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్‌ వీడియో

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)