Breaking News

పెళ్లయిన నవమాసాలకే ఘోరం.. కడుపులో ఉంది ఆడబిడ్డ అని తెలియడంతో

Published on Wed, 02/15/2023 - 13:19

బెంగళూరు: భర్త వరకట్న దాహానికి నవ వధువు బలైన సంఘటన కర్ణాటకలోని బెంగుళూరు రూరల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బెంగుళూరు రూరల్‌ జిల్లా దొడ్డ తాలూకా ఆచార్లహళ్లిలో చోటుచేసుకుంది. తనుశ్రీ (22) మృతురాలు. వివరాలు.. చిక్క బళ్లాపురం జిల్లా చింతామణి తాలూకా జంగమసీగేహళ్లి గ్రామానికి చెందిన తనుశ్రీని దొడ్డ తాలూకా ఆచార్లహళ్లికి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో 9 నెలల క్రితం వివాహం జరిపించారు. మొబైల్‌ షాపు పెట్టుకున్న నవీన్‌కి భారీగా వరకట్నం సమర్పించారు. కానీ ఇంకా కట్నం తీసుకురావాలని తరచూ తనుశ్రీని పీడించేవాడు. ఫిబ్రవరి 9వ తేదీన కూడా తనుశ్రీ పుట్టింటి నుంచి రూ.1.20 లక్షలు నగదు తీసుకువచ్చింది.

మరోవైపు ఆమె గర్భం దాల్చగా స్కానింగ్‌ చేసి కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసి భర్త, అత్త, మరిది బలవంతంగా అబార్షన్‌ చేయించారని సమాచారం. ఈ తరుణంలో మంగళవారం తనుశ్రీ ఇంట్లో అనుమానాస్పదంగా ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. భర్త నవీన్, అత్త సువర్ణమ్మ, మరిది కిరణ్‌కుమార్‌ ఇల్లు వదిలి పరారయ్యారు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో తనుశ్రీ తల్లిదండ్రులు, బంధువులు పరుగున చేరుకున్నారు. తమ బిడ్డను అత్తింటివారే కొట్టి చంపారని విలపించారు.దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)