Breaking News

కుక్కకు ఆహారం వేస్తూనే ఉంది.. చెంప దెబ్బలు తింటూనే ఉంది!

Published on Sat, 08/23/2025 - 20:19

ఘజియాబాద్‌:  వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర పరిగణించిన సంగతి తెలిసిందే. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని  ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. 

ఇదిలా ఉంచితే, యూపీలో ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఒక మహిళ.. కుక్కకు ఆహారం పెడుతూ చెంప దెబ్బల బారిన పడింది. తన అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో  ఉన్న వీధి కుక్కకు ఓ మహిళ ఆహారం పెడుతుంటే దాన్ని ఆ అపార్ట్‌మెంట్‌ వాసి ఒకరు అడ్డుకున్నారు. ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావా? అని అడగ్గా, ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. 

దాంతో ఆ మహిళను చెంప దెబ్బ కొట్టాడు సదరు వ్యక్తి. ఇలా ఆమె ఆహారం పెడుతూనే ఉంది.. అతను చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. సుమారు 38 సెకన్లలో 8సార్లు చెంప దెబ్బలకు గురైంది సదరు మహిళ.  ఘజియాబాద్‌లోని విజయ్‌ నగర్‌లోని బ్రహ్మపుత్రా ఎన్‌క్లేవ్‌ సోసైటీలో ఇది జరిగింది.  ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తిని కమల్‌ ఖన్నాగా గుర్తించారు. 

ఇదీ చదవండి: 

స్టెరిలైజేషన్‌ తర్వాత వదిలేయాల్సిందే 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)