Breaking News

నైట్‌క్లబ్‌లో దారుణం.. భార్యపై లైంగిక దాడి.. భర్తకు చావు దెబ్బలు

Published on Mon, 12/15/2025 - 11:40

జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకంది. ఇక్కడి ఒక నైట్‌క్లబ్ యజమాని తన కోరిక తీర్చలేదని ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన జైపూర్‌లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘క్లబ్ ఆల్ఫా’లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇరామ్ షేక్ తన భర్త నవేద్ ఉస్మానీతో కలిసి క్లబ్‌కు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఒక వెయిటర్.. క్లబ్ యజమాని భరత్  ఆమెను ఒక ప్రైవేట్ గదిలో కలవాలనుకుంటున్నట్లు తెలియజేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా క్లబ్‌ యజమాని అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.

ఆ దంపతులు క్లబ్‌లో సేదతీరిన కొద్దిసేపటి తర్వాత ఇరామ్ షేక్ వాష్‌రూమ్ వైపు వెళ్లారు. అదే సమయంలో క్లబ్ యజమాని భరత్, మేనేజర్ దీపక్, పలువురు బౌన్సర్లు ఆమెను చుట్టుముట్టి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నవేద్ ఉస్మానీ  అక్కడకు పరుగుపరుగున వచ్చాడు. అతను క్లబ్‌ యజమాని,  సిబ్బందిని అడ్డుకున్నాడు.  దీంతో భరత్, మేనేజర్ దీపక్, బౌన్సర్లు కలిసి నవేద్ ఉస్మానీపై దాడి చేసి, ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో నవేద్ ఉస్మానీ కాలు  విరిగింది. అంతటితో ఆగని బౌన్సర్లు బాధిత దంపతుల కారును కూడా ధ్వంసం చేశారు.

కొద్దిసేపటి తరువాత బాధితులు ఈ దాడి గురించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు  గాయపడిన నవేద్‌ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత దంపతులు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఏసీపీ బలరామ్ చౌదరి తెలిపారు. ఘటన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని, నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సేకరిస్తున్నామన్నారు. సేకరించిన ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నైట్‌క్లబ్ యజమాని, సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)