Breaking News

బస్టాండ్‌లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!

Published on Fri, 07/17/2026 - 09:26

మంగుళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిపై ఓ వ్యక్తి మారణాయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, బంట్వాల్‌లోని కేఎస్‌ఆర్‌టీసీ న్యూ బస్ స్టాండ్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. ఆమె కక్కేపదవు ప్రాంతానికి చెందిన యువతిగా, కళ్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. లావణ్య బస్సు కోసం వేచి ఉండగా నిందితుడు ఆమె వద్దకు వచ్చాడు. అనంతరం తన బ్యాగులో నుంచి పదునైన ఆయుధాన్ని తీసి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించినా, నిందితుడు వెంటాడి దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర గాయాలతో ఉన్న లావణ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

బంధువే నిందితుడా?
ఈ ఘటనలో నిందితుడిగా చేతన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు మృతురాలికి దూరపు బంధువని, కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య తన ప్రేమను తిరస్కరించడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు.

ఈ దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బంట్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక, బస్టాండ్ వంటి బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ హత్య స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)