Breaking News

మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..

Published on Mon, 05/01/2023 - 09:15

డిల్లీలో జరిగిన మన్‌ కీ బాత్‌ 100వ ఎపీసోడ్‌ని బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా 11 విదేశీ భాషల తోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా అట్టహాసంగా ప్రసారమైంది. ఐతే ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ మన్‌కిబాత్‌ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన  24 ఏళ్ల పూనమ్‌ దేవికి అకస్మాత్తుగా నొప్పులు రావడం మొదలైంది. దీంతో పూనమ్‌ను హుటాహుటినా రాజధానిలోని ఆస్పత్రికి తరలించారు ఆమె భర్త. పూనమ్‌ ఉత్తరప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ. 

ఆమెకు అదేరోజు(ఆదివారం) సాయంత్రం 6.42 నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజధానిలోనే తమ బిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టుకుంటామని పూనమ్‌ భర్త ప్రమోద్‌ కుమార్‌ చెప్పారు. సదరు మహిళ పూనమ్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాజధాని ఢిల్లీకి వచ్చారు. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లలో ఒక ఎపిసోడ్‌లో మహిళలకు ఆదాయపు వనరులను సృష్టించడం కోసం  ఆమె చేసిన కృషి, సాధించిన విజయాల గురించి ప్రసంసించడం విశేషం.

ఐతే తన భార్య గర్భం దాల్చడంతో రాజధానికి వెళ్లేందుకు తాను అంగీకరించలేదని ఆమె భర్త పేర్కొన్నారు. ఐతే తన భార్య స్వయం సహాయక బృందంలో తను చేసిన పనిని గుర్తించారని, దాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వెళ్లాలంటూ పట్టుబట్టడంతో వచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. పూనమ్‌ లఖింపూర్‌ ఖేరీలోని సమైసా గ్రామంలో సరస్వతి ప్రేరణ గ్రామ్‌ సంగతన్‌ అనే స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె అరటి కాండం నుంచే వచ్చే ఫైబర్‌తో హ్యాండ్‌బ్యాగ్‌ల, చాపలు వంటి ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది.

ఇది గ్రామంలోని మహిళలకు మంచి అదనపు ఆదాయ వనరులను అందించడమే గాక గ్రామంలో వ్యర్థాలను తొలగించడానికి కూడా దోహదపడింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితుల్లో ఆమె కూడ ఒకరు. ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌లో సమాజానికి విశేషమైన సహాయ సహకారాలు అందించిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడూ.. ఆమె గురించి కూడా ప్రస్తావించారు. కాగా, ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్‌ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధంకర్‌ ప్రారంభించారు. ఈ కార్యకమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌, సమాచార  ‍ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

(చదవండి: గుజరాత్‌ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్‌ కునుకు.. ఆ కమిట్‌మెంట్‌కు ఫలితంగా..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)