Breaking News

సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..  

Published on Thu, 07/13/2023 - 15:18

న్యూఢిల్లీ: సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో అత్యధికులు తమకు తామే సెలెబ్రిటీలమన్న భావన ఉంటున్నారు. కొంతవరకు మంచిదే కానీ కేవలం లైకులు కామెంట్ల కోసం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు.  ఇలాగే ఒకామె తొందరపడి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభాసుపాలైంది. 

అమ్రిత్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న ఒక యువతి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని చాలా క్రియేటివ్ గా పోస్ట్ చేసింది. ఆమె అమ్మమ్మ బ్రతికుండగా సోఫాలో కూర్చుని తింటున్న ఫోటోను ఒకపక్కన మరొపక్కన ఆమె లేకుండా ఖాళీగా ఉన్న సోఫా ఫోటోను పోస్ట్ చేసి.. ఫోటోలతో పాటు "నేను దీని నుండి ఎప్పటికీ కోలుకోలేను.." అని రాసింది. పెద్దావిడ మరణవార్తను తన ఫాలోవర్లకు చెప్పాలన్న కుతూహలం కన్నా వారి సానుభూతి రూపంలో లైకులు కామెంట్లు పొందాలన్న ఆమె ఆత్రుతే ఎక్కువగా కనిపించింది నెటిజన్లకు. 

దీంతో వారు కూడా సున్నిత శైలిలో విచారాన్ని వ్యక్తం చేస్తూ కఠినమైన కామెంట్లతో ఆ యువతిని చెడామడా వాయించేస్తున్నారు. "మీ అమ్మమ్మ మరణం తీరని లోటు. అలాగని ప్రతిదీ ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలా?" అని కొందరు రాస్తే.. ఆమె చావు నీకు ఇలా ఉపయోగపడిందన్న  మాట, మీకు రిప్లై ఇస్తే నాకు మెసేజులు మీద మెసేజులు వస్తున్నాయని మరొకరు.. కామెంట్లు చేశారు. ఎవరేమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కనబెడితే.. సదరు వ్యక్తి చేసిన పోస్టుకు మాత్రం 40 లక్షల పైచిలుకు వీక్షణలు దక్కాయి.  అదీ సోషల్ మీడియా పవర్ అంటే..     

ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)