Breaking News

ఒడిశాలో దారుణం..డబ్బుకోసం ఆఖరికి మృతదేహాలను..

Published on Wed, 06/07/2023 - 16:16

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం హృదయాన్ని కలిచివేస్తే..అక్కడ జరగుతున్న కొన్ని ఘటనలు అత్యంత విస్తుపోయేలా ఉన్నాయి. తమ వాళ్లను కోల్పోయి వారిని కనుగొనడం, గుర్తుపట్టడంతో నరకయాతన చూస్తుంటే..కొందరు వాటినే క్యాష్‌ చేసుకోవాలనే దురాలోచనతో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్‌ ఫండ్‌ కోసం కక్కుర్తి పడి దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం అలానే ఇక్కడో మహిళ అలాంటి దారుణానికే తెగబడి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకుంది. 

వివరాల్లోకెళ్తే..కటక్‌ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా జూన్‌ 2న జరిగిన ప్రమాదంలో తన భర్త బిజయ్‌ దత్తా చనిపోయాడంటూ అక్కడ ఉన్న మృతదేహాన్ని తన భర్తగా గుర్తించినట్లు చెప్పింది. ఐతే డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ తర్వాత ఆమె వాదన తప్పు అని తేలింది. దీంతో పోలీసులు ఆమెకు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయితే ఆమె భర్త మానియబంధ్‌ మాత్రమే ఊరుకోలేదు. ఏకంగా పోలీస్టేషన్‌కు వచ్చి ఆమెపై ఫిర్యాదు చేశాడు.

గత 13 ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నట్లు అతను పోలీసులకు తెలిపాడు. ప్రజాధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినందుకు, పైగా తననే చనిపోయినట్లు ప్రయత్నించినందుకు గీతాంజలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజయ్‌ డిమాండ్‌ చేశారు. ఐతే ఘటన బాలోసోర్‌ జిల్లాలో బహనాగా పోలీస్టేషన్లో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని గీతాంజలి భర్తకు తెలిపినట్లు మణిబండ పోలీస్టేషన్‌ ఇన్‌చార్జ్‌ బసంత్‌ కుమార్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా మృతదేహాలపై నకిలీ హక్కుదారుల ముసుగులో వచ్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వేస్‌ని, ఒడిశా పోలీసులను కోరారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరణించిన వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించగా, ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. 

(చదవండి: ఆ దుర్ఘటన మిగిల్చిన కన్నీటి కథలు..తమ వాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు)
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)