భర్తకు దూరంగా వివాహిత.. తన ప్రేమకు అడ్డుచెప్పిందని..

Published on Thu, 08/21/2025 - 09:50

సాక్షి, బెంగళూరు: ప్రేమ నిరాకరించినందుకు వివాహితను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. సినీ ఫక్కీలో కారులో ఉంచి చెరువులోకి నెట్టేయడంతో ఆమె జలసమాధి అయ్యింది. ఈ సంచలన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మృతిరాలిని హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32)గా గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్వేత కొంతకాలం కిందట భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటోంది. ఆమె హాసన్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని ఆమెను సతాయించేవాడు. అయితే, అతడి ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించింది. దీంతో, ఆవేశానికి గురైన రవి శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

అనంతరం, ఆమెను బయటకు తీసుకెళ్లే క్రమంలో కారులో ఎక్కించుకుని వచ్చాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. కారులోనే శ్వేతను ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత.. కారు అనుకోకుండా చెరువులో పడిందని , అందులో స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా.. రవి నిజం ఒ‍ప్పుకున్నాడు. తానే ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. 
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)