తల్లి పరీక్ష రాస‍్తుండగా.. శిశువును ఆడించిన కానిస్టేబుల్‌..

Published on Tue, 07/11/2023 - 21:45

అహ్మదాబాద్‌: పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనుసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది. తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును కానిస్టేబుల్‌ ఒడిలోకి తీసుకుని ఆడించింది. గుజరాత్‌లోని ఓదావ్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ ‍కాగా.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

గుజరాత్‌లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆదివారం జరిగింది. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓదావ్‌లో జరిగిన సెంటర్ వద్దకు ఓ అభ్యర్థి తన బిడ్డతో పరీక్ష కేంద్రానికి హజరైంది. శిశువును సెంటర్ బయట వదిలి లోపలికి వెళ్లింది తల్లి. ఇంతలో ఆ శిశువును ఏడుపు ఆరంభించింది. పరిస్థితిని గమనించిన మహిళా కానిస్టేబుల్ దయా బెన్‌ ఆ చంటిబిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించింది. దీంతో ఆ మహిళా అభ్యర్థి సౌకర్యంగా పరీక్ష పూర్తి చేసింది. 

ఈ వీడియోను గుజరాత్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది. మహిళా కానిస్టేబుల్ దయా బెన్‌పై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. విధుల్లోనూ మాతృత్వాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దయా బెన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)