Breaking News

గులాబ్‌ జామూన్‌తో మాజీ మంత్రికి చిక్కులు

Published on Wed, 12/25/2024 - 12:43

దొడ్డబళ్లాపురం: శ్వేతా గౌడ అనే మహిళ మాజీ మంత్రి పేరు చెప్పుకుని బెంగళూరు కమర్షియల్‌ వీధిలో ఓ జ్యువెలరీ షాప్‌ నుంచి రూ. 2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వకుండా టోకరా ఇచ్చిన కేసు మలుపు తిరిగింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌ భారతినగర పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నిందితురాలు.. ఆయన ముద్దుగా పిలుచుకునే గులాబ్‌ జామూన్‌.. శ్వేతాగౌడ ఇచ్చిన మొత్తం రూ.12.50 లక్షల విలువైన నగదు, గిఫ్ట్‌లు, బంగారు నగలను పోలీసు అధికారులకు అప్పగించారు. శ్వేతగౌడ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఆమె అడగకుండానే కానుకలు ఇచ్చిందని పోలీసులకు వర్తూరు తెలిపారు. తన పేరు చెప్పగానే జ్యువెలరీ షాప్‌ యజమాని కోట్ల విలువైన నగలను ఆమెకు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.

ఫేస్‌బుక్‌లో పరిచయమై..
అయితే శ్వేతా గౌడ, వర్తూరు ప్రకాశ్‌ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని, అనేకసార్లు మైసూరు చాముండి కొండకు వెళ్లారని, తిరుమల కొండకు వెళ్లడానికి టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మూడు నగల షాపుల్లో షాపింగ్‌ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. 6 నెలల క్రితం శ్వేతాగౌడ వర్తూరుకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైందని, తరువాత వాట్సాప్‌, మెసెంజర్‌లలో ఘాటుగా చాటింగ్‌ చేసుకున్నారని, శ్వేతగౌడ మొబైల్‌ నంబర్‌ను గులాబ్‌ జామూన్‌ అని వర్తూరు ప్రకాశ్‌ సేవ్‌ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

మరో ఆభరణాల మోసం..
యశవంతపుర: మాజీ ఎంపీ డికే సురేశ్‌ చెల్లినని చెప్పుకొంటూ మహిళ ఒకరు 14.6 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి మోసం చేసిన ఘటన బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఐశ్యర్య గౌడ, నటుడు ధమేంద్ర, హరీశ్‌ అనే వ్యక్తులపై కేసు నమోదైంది. ఐశ్వర్య.. ఓ నగల దుకాణానికి వెళ్లి 11 సార్లు బంగారాన్ని కొనుగోలు చేసి మాజీ ఎంపీ పేరు చెప్పి వెళ్లిపోయింది. దీంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి