Breaking News

లోన్‌ ప్రాసెస్‌.. డబ్బులు ఉఫ్‌

Published on Tue, 11/12/2024 - 11:37

కృష్ణరాజపురం: నేటి రోజుల్లో అందరికీ డబ్బులు అవసరమే. దానినే మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకులో లోన్‌లు ఇప్పిస్తామని వేలాదిమంది వద్ద ప్రాసెసింగ్‌ ఫీజులని లక్షల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయిన కిలాడి గ్యాంగ్‌ ఉదంతం బయటపడింది. బాధితులు బెంగళూరులోని హైగ్రౌండ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రేష్మా అనే మహిళను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆనంద్, రేష్మా, అంజుం, అనియా అనే నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.  

ఏం చేసేవారంటే..  
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకార కో ఆపరేటివ్‌ సొసైటీ బ్యాంకులో రూ. 1 లక్ష నుంచి 25 లక్షల వరకు సులభంగా లోన్లు ఇప్పిస్తామని ఈ ముఠా ప్రచారం చేసుకుంది, దీంతో అనేకమంది వీరి బుట్టలో పడిపోయారు. లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజులని చెప్పి బాధితుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేశారు. కానీ అప్పు మాత్రం ఇప్పించలేదు. ఫీజు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే అడ్రస్‌ లేకుండా పోయేవారు. 

మోసపోయామని గుర్తించిన వందలాది మంది బాధితులు హైగ్రౌండ్స్‌ ఠాణాలో ఫిర్యాదులు చేశారు. కిలాడీ రేష్మా తనకు రాజకీయ నాయకులు తెలుసని ఈ దందాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ ముఠా సుమారు 2 వేల మంది నుంచి డబ్బులు కైంకర్య చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ డబ్బు కోట్ల రూపాయల్లోనే ఉండవచ్చని తెలుస్తోంది. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)