దేశంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా?

Published on Sun, 07/12/2026 - 19:58

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో పలు అంశాలపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో దీని ప్రభావం ఇంధన రవాణాపై మరోసారి పడే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జూలై 19న ఈ సమావేశం జరగనుంది. ఇందులో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ఉత్కంఠ నెలకొంది. దేశంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వాటికి ఒక రోజు ముందు (జులై 19న) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రాధాన్యం ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరాలు తెలియజేయనుందని చెబుతున్నారు.

జులై 19 ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందువల్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎజెండాపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రతినిధులకు ఆహ్వానం పంపుతోంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు తమ ప్రశ్నలను కూడా ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ వర్షాకాల సమావేశాల్లో దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. చట్టం-శాంతిభద్రతల నుంచి సరిహద్దు భద్రత వరకు పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం అంశంతో పాటు రామ మందిరంలో విరాళాల చోరీ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)