Breaking News

రాహుల్‌ వయనాడ్‌ సీటును వదులుతారా? సీపీఐకి ఏం కావాలి?

Published on Thu, 02/08/2024 - 07:11

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఇదిలావుంటే మమతా బెనర్జీ, నితీష్‌ కుమార్‌ల తర్వాత వామపక్షాలు కూడా కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌కు సవాళ్లు పెరుగుతున్నాయి. కేరళలోని రాహుల్ గాంధీ స్థానమైన వయనాడ్‌పై సీపీఐ తన వాదనలు వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఈ సీటును వదులుకునే పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ, సంకీర్ణ రాజకీయాల కారణంగా రాహుల్ ఈ సీటును వదిలిపెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

సీపీఐ చూపు ఇప్పుడు రాహుల్‌కు చెందిన వయనాడ్‌ సీటుపై పడింది. వయనాడ్‌ ఎప్పటి నుంచో లెఫ్ట్ సీటు అని, కాబట్టి రాహుల్ నిజంగా బీజేపీని సవాలు చేయాలనుకుంటే ఉత్తర భారతదేశంలోని ఏదైనా స్థానం నుండి పోటీ చేయాలని సీపీఐ చెబుతోంది. కాగా సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం మాట్లాడుతూ రాహుల్ స్థాయి వ్యక్తులు వాయనాడ్‌ను ఎన్నుకునేందుకు బదులుగా ఉత్తరాదితో పోరాడాలి. ఉత్తరాదిలో బీజేపీతో ప్రధాన పోరు ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్‌ లేదని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే రాహుల్‌కి వయనాడ్‌ సీటు సేఫ్‌ అనే వాదన వినిపిస్తుంటుంది. 2019లో రాహుల్ వయనాడ్‌లో సీపీఎం అభ్యర్థిని నాలుగు లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అమేథీలో ఓడిపోయారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాహుల్‌కు మద్దతు నివ్వాలని కాంగ్రెస్ వామపక్షాలను అభ్యర్థిస్తోంది.

సీపీఐ, సీపీఎం తదితర వామపక్షాలు రాహుల్‌కు మద్దతివ్వాలని తాము కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ అన్నారు. కేరళ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలని కేరళ ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని కూడా సురేష్‌ పేర్కొన్నారు. అయితే వయనాడ్‌ సీటు విషయంలో రెండు పార్టీలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇండియా కూటమికి చెందిన ఈ రెండు పక్షాలు  వయనాడ్‌ సీటు విషయంలో తమ వాదనలపై గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)