ప్రియుడితో సినిమాకు వెళ్లిన భార్య.. నరికి చంపిన భర్త!

Published on Thu, 07/02/2026 - 10:49

చెన్నై: తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి, ప్రియుడితో సినిమాకు వెళ్లిందని తెలుసుకున్న ఓ భర్త కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి, ఇంట్లోనే దాచి ఉంచాడు. ఈ సంఘటన వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని రాజకల్‌ పంచాయతీ కూతండవర్‌ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కూతండవర్‌నగర్‌కు చెందిన విజయకుమార్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని  భార్య ధనలక్ష్మి(36). వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. ధనలక్ష్మి పేర్నంబట్టులోని ఒక ఇంటిలో పని మనిషిగా పనిచేసేది. 

దీంతో ధనలక్ష్మి  పది రోజులకోసారి మాత్రమే తన ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య పదిరోజులకోసారి మాత్రమే ఇంటికి వస్తూండడంతో విజయకుమార్‌ అనుమానించాడు. ఇదలా ఉంచితే, రెండ్రోజుల క్రితం ధనలక్ష్మి తన రెండవ కుమార్తె, ప్రియుడితో కలిసి ఆంబూరులోని ఒక సినిమా చేసి ఆ తర్వాత ఆటోలో స్వగ్రామానికి వెళ్లింది. పనికెళ్తున్నట్టు చెప్పి ఆమె సినిమాకు ప్రియుడితో వెళ్లినట్లు కుమార్తె ద్వారా తెలుసుకున్న విజయకుమార్‌ రగిలిపోయాడు. తన కుమార్తెలు, కుమారుడిని బంధువుల ఇంటికి పంపించి, ఆ తర్వాత భార్యను నిలదీశాడు.  మాటామాటా పెరగడంతో ఆగ్రహించిన విజయకుమార్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు.

 చేతుల నరాలు కట్‌ చేసి, గొంతు కోసి ముక్కలుగా నరికాడు. ఆమె కాళ్లు, చేతులను ఒక గోనె సంచిలో  కట్టి  ఇంటిలోని వంటగదిలోని స్లాబుపై పెట్టాడు. రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేశాడు. ఆపై ఏమీ ఎరగనట్లు మంగళవారం ఉదయం నుంచి తన భార్య కనిపించడం లేదంటూ బంధువులకు చెప్పాడు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం ఉదయం విజయకుమార్‌ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించి  సమాచారం ఇవ్వడంతో మేల్‌పట్టి పోలీసులు విజయకుమార్‌ ఇంటికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని, నెత్తుటి మరకలు తుడిచిన గుడ్డను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)