Breaking News

ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక ఏం జరిగింది?

Published on Tue, 07/22/2025 - 10:28

సాక్షి, ఢిల్లీ: హస్తినలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌(74) చేసిన రాజీనామా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆరోగ్య కారణాల రిత్యా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫేర్‌వెల్‌ స్పీచ్‌, ఈవెంట్‌ లేకుండానే ఆయన నిష్క్రమించడం పలు కోణాల్లో చర్చకు కారణమైంది.

ధన్‌ఖడ్‌ నిబంధనలు, ప్రోటోకాల్‌ పాటించే వ్యక్తి. నిన్న బీఏసీకి జేపీ నడ్డా, కిరెన్‌ రిజిజు ఉద్దేశపూర్వకంగానే రాలేదు. దీంతో ధన్‌ఖడ్‌ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నాం 1గం. నుంచి సాయంత్రం 4.30గం. మధ్య ఏదో జరిగింది అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఓ ట్వీట్‌ చేశారు. ధన్‌ఖడ్‌ రాజీనామాకు లోతైన కారణాలే ఉన్నాయని అంటున్నారాయన.  ఇక ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ‘‘ధన్‌ఖడ్‌ రాజీనామా ఆయన నిర్ణయం. ఆయన రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలుసు’’ అంటూ కామెంట్‌ చేశారు. 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిన్ననే(జులై 21) ప్రారంభం అయ్యాయి. రాజ్యసభకు చైర్మన్‌ హోదాలో ధన్‌ఖడ్‌ హాజయ్యారు. సభలో హుషారుగానూ కనిపించారు. అంతేకాదు.. సాయంత్రం ఆరు గంటల దాకా ఆయన్ని పలువురు నేతలు వెళ్లి కలిశారు. ఈలోపు అనూహ్యంగా.. రాత్రి 9:30గం. సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. 

జగ్దీప్‌కు ఈ మధ్యే గుండెకు సంబంధించిన చికిత్స తీసుకున్నారు. అనారోగ్య కారణంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని తన ఆర్టికల్ 67 (ఏ) కింద రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ.. ఆ లేఖను రాష్ట్రపతికి పంపించారు కూడా. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్‌ఖడ్‌.. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఇలా రాజీనామా చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. 

ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక వ్యక్తిగతం కాదని..  రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ ప్రముఖంగా నడుస్తోంది. బీజేపీ ఈ అంశంపై ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే మాత్రం ప్రతిపక్షాల అనుమానాలపై మండిపడ్డారు. గతంలో ఆయన్ని అభిశంసించేందుకు(పదవి నుంచి తొలగించేందుకు) ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను గుర్తు చేసిన దుబే.. ఆయన ఆరోగ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు ఈ అంశంలో డ్రామాలు ఆడడం ఆపాలని అంటున్నారు. 

మరోవైపు.. ఉద్దేశపూర్వకంగానే బీఏసీకి హాజరు కాలేదన్న కాంగ్రెస్‌ ఆరోపణలను జేపీ నడ్డా కొట్టిపారేశారు. తాను హాజరు కాలేకపోతున్నాననే సమాచారం ధన్‌ఖడ్‌కు ఇచ్చానని తెలిపారాయన. 

దాల్‌ మే కుచ్‌ కాలా హై రీతిలో.. ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక ఒత్తిళ్లు ఉన్నాయని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకే ధన్‌ఖడ్‌తో బలవంతంగా రాజీనామా చేయించారని విపక్ష నేతల మధ్య చర్చ నడుస్తోంది.

గతంలో.. మనదేశంలో ఉపరాష్ట్రపతి పదవికి మధ్యంతర రాజీనామాలు చాలా అరుదైనవే. వీవీ గిరి, ఆర్‌ వెంకట్రామన్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ, కేఆర్‌ నారాయణన్‌లు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అయితే వీళ్లు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ,

భైరాన్‌సింగ్ షెకావత్ (2007):

  • రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిభా పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యాక రాజీనామా చేశారు.
  • ఆయన రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి 21 రోజుల పాటు ఖాళీగా ఉంది.

జగదీప్ ధన్ఖడ్ (2025):

  • ఇప్పుడు ఆకస్మికంగా రాజీనామా చేసి వార్తల్లోకి ఎక్కారు
  • ఆయన అనారోగ్య కారణాలు చూపించినప్పటికీ.. రాజకీయంగా వివిధ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మరణంతో.. కృష్ణకాంత్ (2002): పదవిలో ఉండగానే మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి.

e President Bhairon Singh Shekhawat resigned from the post on July 21, 2007, after being defeated in the presidential election against Congress-led UPA nominee Pratibha Patil. After Shekhawat's resignation, the vice president's post was vacant for 21 days, before Mohammad Hamid Ansari was elected to the position. Vice Presidents R Venkataraman, Shankar Dayal Sharma and K R Narayanan too had resigned from their posts, but after their election as the president. Krishan Kant was the only vice president to die in office. He passed away on July 27, 2002.

https://www.deccanchronicle.com/nation/current-affairs/dhankhar-3rd-vice-president-to-quit-mid-term-1892942

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)