Breaking News

గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

Published on Wed, 07/30/2025 - 10:39

తప్పులెన్నువారు తండోపతండంబు.. అనే ఓ వేమన పద్యం ఉంది. దాని తాత్పర్యం ఏంటంటే.. ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరని. అలాంటి బాపతు ఓ అధికారికి అనుకోని నిరసన ఎదురైతే.. దెబ్బకు గుంజీలు తీయాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్ జిల్లా సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐఏఎస్‌ రింకు సింగ్ రాహీకి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌గా ఆయన అందరి ముందు గుంజీలు తీసి చెంపలు వేసుకుని క్షమాపణలు వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు.

సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ హోదాలో తొలిరోజే ఆయన తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది అక్కడ బహిరంగ మూత్రవిసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో వాళ్లను పిలిపించుకున్న ఆయన గుంజీలు తీయించాడు. టాయిలెట్లు వాడమని అక్కడ సూచన బోర్డులు ఉన్నప్పటికీ.. కొంతమంది ఇలా బహిరంగ విసర్జనకే మళ్లుతున్నారని, అందుకే శిక్షగా గుంజీలు తీయించామని ఆయన మీడియాతో చెబుతూ కనిపించాడు. అంతేకాదు.. కొంత మంది పిల్లలు బడి ఎగ్గొట్టి ఆ కాంపౌండ్‌లో తిరుగుతున్నారని.. బాధ్యతగా లేని వాళ్ల తల్లిదండ్రులకు ఇదే తరహా శిక్ష తప్పదని హెచ్చరించారాయన. అయితే ఈలోపు..

తహసీల్దార్‌ వద్ద ఉన్న కొంత మంది లాయర్లు ఇదంతా గమనించారు. గుంజీలు తీసిన వాళ్లలో తమకు చెందిన క్లర్క్‌ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్డీఎం రింకు సింగ్‌ను నిలదీశారు. దానికి ఆయన సమాధానం ఇవ్వగా.. అక్కడి టాయిలెట్‌లు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని, పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మీరూ గుంజీలు తీస్తారా? అని నిలదీస్తూ ఆ లాయర్లు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో.. 

ఏం పాలుపోనీ ఆయన ‘అవును’ అంటూ చెంపలేసుకుంటూ ఆయన గుంజీలు తీస్తూ క్షమాపణలు చెప్పారు. దీంతో ఆ లాయర్లు శాంతించి నిరసన విరమించారు. తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయిందని, టాయిలెట్‌లు పాడైపోయిన స్థితిలో ఉన్నాయనే విషయాన్ని ఓ అధికారి 10రోజుల కిందటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడట.  అయినా ఆ ప్రాంగణమంతా శుభ్రం కాకపోవడం తమ తప్పిదమేనంటూ ఆ ఐఏఎస్‌ పేర్కొన్నారు. తాను చేసిన పనికి నామోషీగా భావించడం లేదని అంటున్నారాయన.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)