Breaking News

రాహుల్‌ గాంధీ డిమాండ్‌ను తిరస్కరించిన ఈసీ

Published on Sat, 06/21/2025 - 17:19

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలోని CCTV ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పదే పదే డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. 

ఈసీ వర్గాలు ఏం చెప్పాయంటే.. 

  • ఓటర్ల గోప్యత: సీసీటీవీ ఫుటేజీ ఫుటేజ్ ద్వారా ఓటు వేసినవారిని, వేయని వారిని గుర్తించవచ్చు. తద్వారా వాళ్లపై వివక్ష లేదంటే బెదిరింపులకు పాల్పవచ్చు. 

  • చట్టపరమైన పరిమితులు: ఈ ఫుటేజ్‌ను బయట పెట్టడం ద్వారా.. ప్రజాప్రతినిధుల చట్టం (Representation of the People Act) ఉల్లంఘన అవుతుంది. పైగా ఓటు వేయడం.. ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. 

  • అంతర్గత వినియోగం మాత్రమే: ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతాం. 

  • ఫుటేజ్ తొలగింపు: ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత వీడియో ఫుటేజ్‌ను తొలగించడం సాధారణ ప్రక్రియనే అని ఈసీ తెలిపింది 

కిందటి ఏడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మయూతీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ పదే పదే చెబుతూ వస్తోంది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ మధ్యే 2024 లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్సాలిడేటెడ్, డిజిటల్ ఓటర్ రోల్స్‌ను ప్రచురించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, మహారాష్ట్రలో ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్‌లలో రికార్డ్ అయిన అన్ని CCTV ఫుటేజ్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈసీ తాజాగా చేసిన ప్రకటనపై రాహుల్‌ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ఫిక్సింగ్‌ అని.. ప్రజాస్వామ్యానికి ఇదొక విషమని పేర్కొంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌  చేశారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు