Breaking News

సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు?

Published on Sun, 09/17/2023 - 11:54

సౌరభ్ చంద్రకర్ పేరు ఎప్పుడైనా విన్నారా? కొంతకాలం క్రితం వరకు ఈ పేరు గురించి ఎప్పుడూ చర్చ జరగలేదు. ఇప్పుడు హఠాత్తుగా పతాక శీర్షికల్లో ఈ పేరు కనిపిస్తోంది. సౌరభ్ చంద్రకర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిఘా పెట్టడం, అధికారుల విచారణలో వెల్లడైన షాకింగ్ వివరాలే ఇందుకు కారణంగా నిలిచాయి. సౌరభ్ తన పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్, ముఖేష్ అంబానీల ఇంట జరిగిన పెళ్లిళ్లు గుర్తుకొస్తాయి. ఈ పెళ్లిళ్లకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశారు. లక్ష్మీ మిట్టల్ తన కుమార్తెకు పారిస్‌లో వివాహం జరిపించారు. ఈ వివాహానికి ఆయన రూ. 240 కోట్లు ఖర్చు చేశారు. 

బంధువుల కోసం ప్రైవేట్ జెట్
మీడియా కథనాల ప్రకారం మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ పెళ్లికి సౌరభ్ చంద్రకర్ దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టాడు. తమ బంధువులు, ప్రముఖులను నాగ్‌పూర్‌ నుంచి దుబాయ్‌ తీసుకువచ్చేందుకు ఆయన ప్రైవేట్‌ జెట్‌ ఏర్పాటు చేశాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెళ్లి ఖర్చుల్లో ఎక్కువ భాగం నగదు రూపంలోనే వెచ్చించాడు. దీనిని చూస్తే సౌరభ్‌ దగ్గర ఎంత సంపద ఉందో అంచనా వేయవచ్చు.

 స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు
మహదేవ్ యాప్‌తో లింక్‌ కలిగిన 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి, రూ.417 కోట్ల విలువైన షేర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాను నడుపుతున్నాడు. బెట్టింగ్‌ ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భారత స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. చంద్రకర్, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్ యాప్’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు.

పలువురు ప్రముఖులు హాజరు
సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోనిఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. తన పెళ్లి కోసం వెడ్డింగ్ ప్లానర్‌కు ఆయన రూ.120 కోట్లు చెల్లించాడు. సౌరభ్ తన బంధువులను దుబాయ్‌కు తీసుకురావడానికి నాగ్‌పూర్ నుండి ప్రైవేట్ జెట్‌లను పంపాడు. వివాహ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారని, దీనికి సంబంధించిన మొత్తం చెల్లింపును హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించారని సమాచారం. యోగేష్ బాపట్‌కు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆర్-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హవాలా ద్వారా రూ.112 కోట్లు ఇచ్చినట్లు డిజిటల్ ఆధారాలు వెల్లడించినట్లు ఈడి తెలిపింది. అదేవిధంగా హోటల్ బుకింగ్ కోసం యూఏఈ కరెన్సీలో రూ.42 కోట్లు చెల్లించాడు.
ఇది కూడా చదవండి: ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?​

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)