Breaking News

నా మార్ఫింగ్‌ ఫొటోల్ని సృష్టించింది మా పార్టీవాళ్లే!

Published on Mon, 07/14/2025 - 15:35

మమతా బెనర్జీ అధినాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇవాళ తీవ్ర కలకలం రేగింది. స్టూడెంట్‌ వింగ్‌ లీడర్‌ రాజన్యా హల్దార్‌(Rajanya Haldar) సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. తన మార్ఫింగ్‌ ఫొటోల వ్యవహారం వెనుక టీంఎసీవాళ్లే ఉన్నారని రాజన్య ఆరోపించగా.. టీఎంసీ ఆ ఆరోపణలకు స్పందించింది.

టీఎంసీ స్టూడెంట్‌ వింగ్‌ లీడర్‌(TMCP) అయిన రాజన్య హల్దార్‌.. గతంలో జాదవ్‌పూర్‌ వర్సిటీకి ప్రెసిడెంట్‌గా పని చేశారు.  కిందటి ఏడాది ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దీంతో టీఎంసీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. తాజాగా కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఉదంతంపైనా ఆమె ఓ టీవీ షోలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఘటనను ఖండించిన ఆమె.. విద్యార్థి నాయకుల్లోని దురుద్దేశాలను, నేరస్వభావాన్ని ఈ కేసు బయటపెట్టిందంటూ ప్రధాన నిందితుడు, టీఎంసీ స్టూడెంట్‌ మాజీ లీడర్‌  మోనోజిత్‌ మిశ్రాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారామె. ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన రోజు నుంచే ఆమె పేరిట అశ్లీల చిత్రాలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలైంది. దీంతో కోల్‌కతా  సైబర్‌ పోలీసులను ఆశ్రయించారామె. 

తన డీప్‌ఫేక్‌ న్యూడ్‌ ఫొటోలను వైరల్‌ చేస్తోంది టీఎంసీ వాళ్లేనని ఆరోపిస్తున్నారామె. ‘‘ఉద్దేశపూర్వకంగానే  పార్టీలో ఉన్న జూనియర్‌ లీడర్లు కొందరు ఏఐ సాయంతో నా డీప్‌ఫేక్‌ ఫొటోలను వైరల్‌ చేస్తున్నారు.  పార్టీ అధిష్టానం గనుక తన వివరణ తీసుకుని దర్యాప్తు జరిపిస్తుందని మాటిస్తే.. వాళ్ల పేర్లను వెల్లడించేందుకు తాను సిద్ధమని ప్రకటించింది. 

అదే సమయంలో ఫేస్‌బుక్‌లోనూ ఆమె ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ఇది నా ప్రతిష్టను దెబ్బ తీయడానికే విద్యార్థి విభాగంలో కొందరు చేసిన పని. నా పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నేను ఈ నాటకాలు ఆడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. ఏది సత్యమో నిర్ణయించాల్సింది ఇక చట్టమే’’ అని అన్నారామె.

కోల్‌కతాలోని వివిధ లొకేషన్ల నుంచి ఆ ఫొటోలు షేర్‌ అయ్యాయి. ఈ ఫేక్‌ ఫొటోలతో తనను బద్నాం చేయడం మాత్రమే కాదు.. టీఎంసీ విద్యార్థి విభాగంలోని యువతుల్లో కొందరిని పదవుల ఆశ చూపించి లొంగదీసుకునే ప్రయత్నం కూడా అని ఆరోపించారామె. అయితే ఈ వ్యవహారంపై టీఎంసీ స్పందించింది. ఈ విషయాన్ని రాజన్య తమకు దృష్టికి తేలేదని.. ఒకవేళ తగిన ఆధారాలతో సంప్రదిస్తే ​ విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీనియర్‌ నేత, మంత్రి ఫిర్హద్‌ హకీమ్‌ చెబుతున్నారు.

రాజన్య హల్దార్‌ టీఎంసీ విద్యార్థి విభాగం సహచరుడు, ఫిల్మ్‌ మేకర్‌ అయిన ప్రాంతీక్‌​ చక్రవర్తిని కిందటి ఏడాది వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ పొలిటికల్‌ థీమ్‌తో కూడిన షార్ట్‌ ఫిల్మ్స్‌ తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీకర్‌ దారుణ ఘటన ఉదంతాన్ని పోలిన షార్ట్‌ ఫిలింలో ఆమె నటించారు. ఇది దుమారం రేపడంతో ఆమెను పార్టీ సస్పెండ్‌ చేసింది. ఇదిలా ఉంటే.. రాజన్య భర్త ప్రాంతీక్‌ పార్టీలోకి తీసుకొచ్చిన కొందరిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు లా స్టూడెంట్‌ అత్యాచార ఉదంతంలో అరెస్ట్‌ అయిన మోనోజిత్‌ మిశ్రాకు ప్రాంతీక్‌కు అత్యంత సన్నిహితుడు ఈ ఎపిసోడ్‌లో మరో కోసమెరుపు.

ఇదీ చదవండి: యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్‌

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)