Breaking News

బిహార్ కేబినెట్‌లో బిగ్‌ స‌ర్‌ప్రైజ్!

Published on Fri, 11/21/2025 - 16:39

ప‌ట్నా: ప్ర‌మాణ స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా నితీశ్ కుమార్ ఎవ‌రూ ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక‌ కాని యువ‌కుడితో మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఫార్మ‌ల్ ష‌ర్ట్‌, జీన్స్ పాంట్ ధ‌రించిన యువ‌కుడు మంత్రిగా ప్ర‌మాణం చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో ఆ యువ‌కుడు ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. అత‌డి పేరు దీప‌క్ ప్ర‌కాశ్‌ (Deepak Prakash). రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్ఎం) అధ్య‌క్షుడు ఉపేంద్ర కుష్వాహా కుమారుడు. విదేశాల్లో చ‌దువుకుని వ‌చ్చిన అత‌డికి అనూహ్యంగా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆరు నెల‌ల్లో అత‌డు చ‌ట్ట‌స‌భ‌కు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆయ‌నను ఆర్‌ఎల్ఎం త‌ర‌పున‌ ఎమ్మెల్సీని చేస్తార‌ని స‌మాచారం.

చ‌క్రం తిప్పిన ఉపేంద్ర 
ఎన్డీఏ కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 4 స్థానాల్లో విజ‌యం సాధించింది. ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) స‌తీమ‌ణి స్నేహల‌త.. ససారాం అసెంబ్లీ నియోజ‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నితీశ్ కుమార్ కేబినెట్‌లో ఆర్‌ఎల్ఎంకు ద‌క్కే ఒక్క ప‌ద‌వి ఆమెకే క‌ట్ట‌బెడ‌తార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే త‌న వారసుడి రాజకీయ అరంగ్రేటం చేయిండానికి ఇదే సరైన స‌మ‌య‌మ‌ని భావించిన ఉపేంద్ర సేఫ్ గేమ్ ఆడారు. త‌న కొడుకు దీప‌క్‌కు నేరుగా కేబినెట్ ప‌ద‌వి ద‌క్కేలా చ‌క్రం తిప్పారు. త‌న రాజ‌కీయ వార‌స‌త్వం కొన‌సాగేలా దీర్ఘ‌కాల వ్యూహంతో కుమారుడిని అనూహ్యంగా తెర‌పైకి తెచ్చారు. సామాజిక స‌మీక‌ర‌ణాలు కూడా దీపక్‌కు క‌లిసివ‌చ్చాయి.

చివ‌రి నిమిషంలో తెలిసింది
మంత్రి ప‌ద‌వి గురించి త‌న‌కు కూడా చివ‌రి నిమిషంలో తెలిసింద‌ని దీప‌క్ తెలిపారు. "నాకు తెలిసినంతవరకు.. మా నాన్న‌, పార్టీ  ముఖ్య నాయకుల మధ్య జ‌రిగిన‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందే నాకు తెలిసి.. ఆశ్చ‌ర్యానికి లోన‌య్యానని  మీడియాతో చెప్పారు. యువత, మహిళల కోసం పనిచేయడం త‌న‌ బాధ్యతగా భావిస్తున్నానని ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత అన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అయితే నితీశ్ కుమార్, అమిత్ షా సానుకూలంగా లేక‌పోవ‌డంతో  వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అత‌డికి మంత్రి ద‌క్కింద‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి.

బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన 36 ఏళ్ల‌ దీపక్ ఇప్ప‌టివ‌ర‌కు క్రియాశీల‌క రాజ‌కీయాల్లో లేరు. ససారాం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న త‌ల్లి త‌ర‌పున ప్ర‌చారం చేసి వెలుగులోకి వ‌చ్చారు. దీపక్ భార్య సాక్షి మిశ్రా (Sakshi Mishra) కూడా అత్త‌గారి త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. 2007లో పాట్నాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన దీప‌క్ 2011లో మణిపూర్‌లోని MIT నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. 2011 నుంచి 2013 వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విదేశాల్లో పనిచేసిశారు. 2019 నుంచి రాజ‌కీయాల్లో త‌ల్లిదండ్రుల‌కు సాయంగా ఉంటూ వ‌చ్చారు. దీప‌క్ తాత రామ్ నరేష్ కుష్వాహా ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. నాన‌మ్మ‌ మునేశ్వరి దేవి సామాజిక కార్యకర్త.

చ‌ద‌వండి: లాలూ ఫ్యామిలీలో చిచ్చు.. ఎవ‌రీ సంజ‌య్, ర‌మీజ్‌?

కేబినెట్‌లో వార‌సుల‌కు చోటు క‌ల్పించ‌డంపై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీప‌క్‌ ప్ర‌కాశ్‌తో పాటు హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్య‌వ‌స్థాప‌కుడు జిత‌న్ రాం మాంఝీ త‌న‌యుడు సంతోష్ కుమార్ సుమన్ (Santosh Kumar Suman) కూడా మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)