Breaking News

Tomato price: టమాటో ధర దిగొచ్చేది అప్పుడేనంట!

Published on Wed, 06/28/2023 - 07:51

ఢిల్లీ: సామాన్యుడితో ‘వామ్మో’ అనిపిస్తున్న టమాటో ధర.. ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల సెంచరీ దాటేసింది. కేజీకి మినిమమ్‌ రూ. 50 నుంచి మొదలై..  కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రూ.120 నుంచి రూ.160 కేజీకి అమ్ముడు పోతూ బెంబేలెత్తిస్తోంది. పోను పోను రేటు పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. దీంతో ఈ పరిస్థితి సాధారణం ఎప్పుడవుతుందనే సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

మరో పది, పదిహేను రోజుల తర్వాత ధరలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. టమాటో ధరలపై  కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ మీడియాతో స్పందించారు.  ‘‘ప్రజలకు చెబుతోంది ఒక్కటే.. పది, పదిహేను రోజుల్లో ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. టమాటో తాజా లోడ్‌లు ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సమయం రెండు వారాలకు మించి ఉండదు. కాబట్టి, పదిహేను రోజుల తర్వాత.. పరిస్థితి మామూలుగా ఉంటుంది. ధరలు కచ్చితంగా దిగొస్తాయని అంటున్నారాయన. 

ప్రతీ ఏడాది ఈ సమయానికి టమాటో ధరల్లో పెరుగుదల సాధారణంగా ఉండేదేనని.. కానీ, ఈసారి పరిస్థితి ఘోరంగా ఉండడమే అడ్డగోలు ధరలకు కారణమని చెబుతున్నారాయన. ప్రతికూల వాతావరణం, సరఫరాపై పరిమితుల వల్లే ఈసారి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారాయన. కొన్ని రాష్ట్రాల్లో వర్షాల వల్ల పంట దెబ్బ తిందని.. తెగులు సమస్యతో పాటు మరికొన్ని చోట్ల టమాటో లోడ్‌లు గమ్యస్థానాలకు చేరుకోలేదని చెబుతున్నారాయన. టమాటో విషయంలోనే కాదు.. చాలా వరకు కూరగాయల విషయంలో ఇదే జరుగుతోందని చెప్తున్నారాయన. ఈ తరుణంలో.. ధరల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నారాయన.

ఇదీ చదవండి: మార్కెట్‌లో ఏది ముట్టుకున్నా.. మంటే!

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)