Breaking News

సెంథిల్‌ బాలాజీ కేసుపై సుప్రీంకోర్టు విస్మయం.. ఏం జరుగుతోంది?

Published on Mon, 12/02/2024 - 16:05

న్యూఢిల్లీ: డీఎంకే నేత డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి అవినీతి కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే  తమిళనాడు మంత్రిగా ఆయనతిరిగి బాధ్యతలు స్వీకరించడంపై  సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ అయిన వ్యక్తి వమంత్రివర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతారనే అభిప్రాయం ఎవరికైనా వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ మేరకు జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనం..సెంథిల్‌ బాలాజీ బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. బెయిల్ ఉత్తర్వులు ఇతరులకు ప్రయోజనం చేకూర్చాయని, కాబట్టి మెరిట్‌లపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే బాలాజీ మంత్రి వర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే దానిపై పిటిషన్ పరిధిని పరిమితం చేస్తామని కోర్టు తెలిపింది.

‘మేము బెయిల్ ఇచ్చిన మరుసటి  మీరు మంత్రి అయ్యారు. ఇప్పుడు సీనియర్ క్యాబినెట్ మంత్రిగా ఉంఉన్నారు. ఈ సమయంలో సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.. ఏం జరుగుతోంది’ అని సెంథిల్ బాలాజీ తరఫున న్యాయవాదిని జస్టిస్ ఏఎస్ ఓకా ప్రశ్నించారు. అయితే దీనిపై తమకు కొంత సమయం కావాలని బాలాజీ న్యాయవాది తెలపడంతో.. తదుపరి విచారణకు డిసెంబరు 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

కాగా డీఎంకే పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సెంథిల్‌ బాలాజీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం అన్న డీఎంకేలో చేరారు. 2011 నుంచి 2015 వరకు జయలలిత ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా మంత్రిగా ఉన్నప్పుడు  అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో గతేడాది జూన్‌లో ఆయనను అరెస్ట్ చేయగా.. 8 నెలల తర్వాత మంత్రిపదవికి బాలాజీ రాజీనామా చేశారు. 14 నెలలు జైల్లో ఉన్న అనంతరం సెప్టెంబరు 26న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం స్టాలిన్ మంత్రివర్గంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల మంత్రిగా చేరారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)