Breaking News

ఢిల్లీలోని చారిత్రక కట్టడాల్లో ఇక డ్రీమ్‌ వెడ్డింగ్స్‌!

Published on Sat, 11/08/2025 - 12:12

న్యూఢిల్లీ: ఇకపై ఢిల్లీలోని పలు చారిత్రక ప్రదేశాలలో వివాహాలు జరుపుకోవడం ఇక కల కానేకాదు.. ఎందుకంటే, త్వరలోనే ఈ అద్భుతమైన కట్టడాలను వివిధ వేడుకల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎంపిక చేసిన వారసత్వ కట్టడాలను పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు బుక్‌ చేసుకునేందుకు అనుమతించే పథకం ప్రస్తుతం సిద్ధమవుతోందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ ఆర్కియాలజీ శాఖ పరిధిలోని అనేక స్మారక చిహ్నాలను ఇప్పటికే ఎంపిక చేశారు. 

నార్తర్న్‌ రిడ్జ్‌లోని మ్యుటినీ మెమోరియల్‌ : 1857 తిరుగుబాటులో మరణించిన సైనికులకు గుర్తుగా 1863లో నిర్మితమైంది.

కశ్మీర్‌ గేట్‌లోని దారా షికో లైబ్రరీ :  ఇది ఒకప్పుడు మొఘల్‌ యువరాజు దారా షికో నివాసం, ఆ తర్వాత బ్రిటిష్‌ కార్యాలయంగా మారింది. 

చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్‌ : నెటిజనుల భావోద్వేగం

మక్బరా పైక్‌ : మొఘల్‌ కాలం నాటి సమాధి. ఇది ఇంపీరియల్‌ కొరియర్‌లలో ఒకరికి చెందినదని భావిస్తున్నారు. 

సాధనా ఎన్‌క్లేవ్‌లోని సమాధి : ఇది లోడీ కాలం నాటి నిర్మాణం. ఇది తొలి ఇండో–ఇస్లామిక్‌ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. 

ఖుద్సియా గార్డెన్‌లోని పెవిలియన్లు : 18వ శతాబ్దపు ప్యాలెస్‌ కాంప్లెక్స్‌లో భాగం. చక్రవర్తి ముహమ్మద్‌ షా భార్య అయిన ఖుద్సియా బేగం దీనిని నిర్మించారు. వీటితో పాటు, లోడి, సయ్యద్‌ కాలాల నాటి మధ్యయుగపు సమాధులు, గోడల అవశేషాలున్న వసంత విహార్‌లోని ప్రాంతాలు, ప్రఖ్యాత ఉర్దూ కవి మీర్జా గాలిబ్‌ నివాసమైన గాలిబ్‌ హవేలీ (చాందినీ చౌక్‌), ప్రయాణికుల విశ్రాంతి గృహంగా భావించే 14వ శతాబ్దపు గోపుర నిర్మాణమైన బరా లాయో కా గుంబద్‌ వంటివి కూడా పెళ్లి వేడుకలకు వేదికలుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వారసత్వ వేదికల బుకింగ్‌ ఫీజుపై జీఎస్టీలో సడలింపు కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  మరి ఈ అద్భుతమైన చారిత్రక వేదికల్లో వేడుకలు జరుపుకోవాలనే ఆలోచన మీకు ఉందా?.. 

ఇదీ చదవండి : నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)