Breaking News

జులై 20 వరకూ ప్రాణాలతో ఉంటా... వాంగ్‌ చుక్

Published on Fri, 07/17/2026 - 13:51

సాక్షి, ఢిల్లీ: జులై 20 న సీజేపీ తలబెట్టబోయే శాంతియుత యాత్ర వరకూ తాను ఎట్టిపరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటానని ప్రముఖ విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌ చుక్‌ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం ఆయన మాట్లాడారు. నీట్‌ లీకేజ్‌కు నిరసనగా జులై 20న పార్లమెంట్‌ వరకూ చేపట్టబోయే శాంతియుత యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.    

నీట్‌ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో మరికొన్ని డిమాండ్లు కోరుతూ సోనమ్‌ వాంగ్‌ చుక్‌ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. దీక్ష 20 రోజుకు చేరుకున్న నేపథ్యంలో  వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఆ నేపథ్యంలో వాంగ్‌చుక్‌ మాట్లాడుతూ "జూలై 20 వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. నేను బయటకు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల చాలా బలంగా ఉన్నాను. మీరంతా కూడా లోపల, బయట అంతే బలంగా ఉన్నారని నాకు తెలుసు. జూలై 20న మనం చేపట్టబోయే శాంతియుత పార్లమెంట్ మార్చ్‌కు ఈ శక్తే మనకు కావాలి. మేమంతా కలిసి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌కు వెళ్లి మా విజ్ఞప్తిని సమర్పిస్తాం."

ఈ సమయంలో ఆయన సరదాగా మాట్లాడుతూ  "నేను జూలై 20 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ మీరు రాకపోయినా, జూలై 20 మార్చ్ విజయవంతం కాకపోయినా, నేను దెయ్యంగానైనా తిరిగి వస్తాను" అని అనడంతో అక్కడ ఉన్న మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందుకే వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 20 పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయడంపైనే ఉండాలని కోరారు.

గత 20 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ కేవలం నీటి పైనే జీవిస్తున్నారని, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సతీష్ లంబా హెచ్చరించారు.సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన శరీరంలోని కొవ్వు, కండరాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆయన ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారు.


ఢిల్లీ హైకోర్టు జోక్యం
ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే తక్షణమే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోర్టు స్పష్టం చేసింది.

NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జూన్ 20 నుంచి కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఈ నిరసనలను ప్రారంభించగా, జూన్ 28న సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)