Breaking News

దాదాపు రెండు దశాబ్దాల జ్ఞాపకం : అసలా విమానం ఉన్నట్టే తెలియదు!

Published on Sat, 11/22/2025 - 17:23

ఎయిరిండియాలో ఒక వింత సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఒక పాత బోయింగ్ 737-200 కార్గో విమానాన్ని 13 ఏళ్లుగా అసలు అలాంటి ఒక విమానం ఉందన్న విషయాన్నే మర్చిపోయింది.  గత వారమే దీన్ని విక్రయించింది. మరి గత దశాబ్దంన్నర కాలంగా పట్టించుకోకుండా వదిలేసిన విమానం గురించి ఎలా తెలిసింది? ఎలా విక్రయించింది?

“పాత విమానాలను అలా వదిలేయడం అసాధారణం కానప్పటికీ,ఇటీవలి దాకా ఇలాంటి విమానం ఒకటి ఉందీ అనేది తెలియదు! కాలక్రమేణా, అది జ్ఞాపకంగా మిగిలిపోయింది. కోల్‌కతా విమానాశ్రయంలోని రిమోట్ పార్కింగ్ బేలో ఉన్న దీని గురించి చెప్పి, దానిని తీసివేయమని అడిగినప్పుడు మాత్రమే వెలుగులోకి వచ్చింది!  నిజంగా అది మనదేనా ధృవీకరించిన తర్వాత, విక్రయించాం అని ఎయిరిఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్  సిబ్బందికి పంపిన సందేశంలో చెప్పారు. గత 13 ఏళ్ల కోల్‌కతా విమానాశ్రయంలోని రిమోట్ పార్కింగ్ బేలో అలా పడి ఉంది. గత 13 ఏళ్లకు పైగా దీని ఉనికిని మరచిపోయింది సంస్థ ప్రైవేటీకరణ తర్వాత దాదాపు మూడు సంవత్సరాల తర్వస్థీ కార్గో విమానం బయటపడింది, అధికారులు టాటా గ్రూప్ కంపెనీని కోల్‌కతా విమానాశ్రయ ప్రాంగణం నుండి దానిని తీసివేయమని కోరారు.  దీంతో ఈ విమానాన్ని సేల్‌ చేసింది ఎయిరిండియా.

చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్‌ 

కాగా 2012లో తన కార్గో వ్యాపారాన్ని మూసివేసింది ఎయిరిండియా. గతంలో బోయింగ్ 737-200 కార్గో విమానాలను నిర్వహించింది. వ్యాపారాన్ని  మూసి వేసిన నేపథ్యంలో ప్రస్తుతం కార్గో విమానాలను ఉపయోగించడం లేదు. విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ planspotters.netలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం VT-EHH 43.2 సంవత్సరాల కంటే పాతది మరియు సెప్టెంబర్ 1982లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ చేయబడింది. ఈ విమానాన్ని ఫిబ్రవరి 1998 లో అలయన్స్ ఎయిర్ లీజుకు తీసుకుంది. జూలై 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ సరుకు రవాణాకోసం దీన్ని ఉపయోగించారు. రెండు విమానయాన సంస్థల విలీనం తరువాత ఇది ఎయిరిండియాకు వచ్చింది.

ఇదీ చదవండి: రాయల్‌ వెడ్డింగ్‌ : గర్ల్‌ఫ్రెండ్‌తో జూ. ట్రంప్‌ స్టెప్పులు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)