Breaking News

మూడు లక్షల ఆధిక్యం.. వయనాడ్‌లో భారీ లీడ్‌లో ప్రియాంక గాంధీ

Published on Sat, 11/23/2024 - 09:49

ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. ప్రియాంకా గాంధీ సత్తా చాటుతున్నారు. వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌లక్షకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారామె.  

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగడంతో..  ఫలితంపైనే యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. 

కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి.. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మూడు లక్షల ఓట్ల భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు.  సీపీఐ నుంచి సత్యన్‌ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ వెనుకంజలో ఉన్నారు. మ‌ధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంది. 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ నుంచి గెలుపొందిన రాహుల్‌ గాంధీ.. తరువాత వయనాడ్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ  ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం. 

వ‌య‌నాడ్‌లో ఈ నెల 13వ తేదీన ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్‌ నేత సత్యన్‌ మొకేరి, బీజేపీ కౌన్సిలర్‌ నవ్య హరిదాస్‌ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు