Breaking News

వీడియో: అరేయ్‌ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?

Published on Fri, 04/11/2025 - 16:42

విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌. ఏదో ధర్నా జరుగుతుంటే.. నిరసనకారుల్లో కొందరిని అరెస్ట్‌ చేయడంలో తన సిబ్బందికి సాయం చేస్తుంటుంది. ఇంతలో వెనకాల పోలీసుల చేతిలో ఉన్న బులుగు చొక్కావోడు.. ఆమె నడుంను పట్టుకుని తెగ ఊగిపోతుంటాడు. చాలామంది  ఇదేదో జోక్‌ అనుకుని.. మెన్‌ విల్‌ బి మెన్‌ అనుకుంటూ వీడియోను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. నవ్వుకుంటున్నారు. కానీ..

ఆ టైంకి ఆ కామాంధుడి చెర నుంచి తనను తాను విడిపించుకున్న ఆమె.. సిబ్బంది సాయంతో పక్కకు తీసుకెళ్లింది.  ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో స్పష్టత లేదు.  కేసు నమోదైన దానిపైనా స్పష్టత లేదు. పలు జాతీయ మీడియా చానెల్స్‌ కథనాలు ఇచ్చాయికానీ.. ఎక్కడ జరిగిందన్నది ప్రస్తావించలేదు. గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. చాలామంది ఆ బులుగు చొక్కావోడిని తిట్టి పారేస్తున్నారు. అలాంటి వాళ్లను వదలకూడదంటూ పోస్టులు పెడుతున్నారు. 

పట్టపగలు.. అదీ ఓ మహిళా పోలీస్‌ పట్ల అలా ప్రవర్తించడం ఏంటని? కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓ మహిళా పోలీస్‌తో ఓ వ్యక్తి బహిరంగంగా.. అసభ్యంగా ప్రవర్తించిన తీరును హాస్య కోణంలో కాకుండా తీవ్రంగా పరిగణించాలని పలువురు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. మహిళా పోలీసులతో ఇలాంటి అసభ్య ప్రవర్తనల ఘటనలు ఈ మధ్యకాలంలోనే చూశాం. మహారాష్ట్రలో నాగ్‌పుర్‌ (Nagpur)లో మార్చి మూడో వారంలో.. రెండు గ్రూప్‌ల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒక అల్లరిమూక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించింది. 

అలాగే.. గణేష్‌పేట ప్రాంతంలో ర్యాపిడ్ కంట్రోల్ పోలీస్ దళంలో  విధులు నిర్వహించిన ఓ అధికారిణి సైతం తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న మరో అధికారిణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారట. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)