Breaking News

ఢిల్లీ ఘటనపై గవర్నర్‌ సక్సేనా ఫైర్‌: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది

Published on Mon, 01/02/2023 - 11:29

దేశ రాజధాని ఢిల్లీలో మహిళ స్కూటీని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఫైర్‌ అయ్యారు. నిందితుల భయానక చర్యను చూసి షాక్‌కి గురయ్యానని అన్నారు. ఈ అమానవీయ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఈ క్రూరమైన చర్యకు దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర మద్దతు, భరోసా అందిస్తాం. కానీ ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ‍్క్షప్తి చేశారు. అందరం మంచి సమాజం కోసం కలిసి పనిచేద్దాం అని సక్సేనా అన్నారు.

కాగా, ఆదివారం న్యూ ఇయర్‌ రోజున ఢిల్లీలోని 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె చక్రాల్లో ఇరుక్కుపోవడంతో చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఈడ్చుకెళ్లడంతోనే ఆమె బట్టలు, శరీరం వెనుకభాగం వైపు ఉన్న బట్టలు చిరిగిపోయాయని వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్‌(డీసీడబ్ల్యూ) చీఫ్‌ స్వాతి మలివాల్‌ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటన చాలా దారుణమైనదని, సాధ్యమైనంత త్వరగా అసలు విషయాలు వెలుగులోకి రావాలని ట్విట్టర్‌లో ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

అంతేగాదు సదరు బాధిత మహిళకు మీరు ఏవిధంగా న్యాయం చేయగలరంటూ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ కారులోని వ్యక్తుల తాగి ఉన్నారు, పైగా ఏ చెక్‌ పోస్ట్‌ వారి కారుని అడ్డుకోలేకపోయందంటూ ట్విట్టర్‌ వేదికగా పోలీసులపై మండిపడ్డారు. దీంతో సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఈ ఘటన గురించి ఆదివారం తెల్లవారుజామున కంజ్వాలా పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులు పికెట్ల వద్ద మోహరించి అధికారులను అప్రమత్తం చేసి వాహానాలను సోదా చేయడం ప్రారంభించారని చెప్పారు.

ఆ ఘటనకు కారణమైన కారుని స్వాధీనం చేసుకోవడంగాక ఆ ఐదుగురు నిందితులను వారి నివాసాల నుంచే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా అధికారులు నిందితులను అదుపులోకి తీసకున్నారని, అలాగే అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

(చదవండి: 10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)