Breaking News

సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్‌

Published on Thu, 10/17/2024 - 14:29

ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి  సీపీఆర్‌ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. 

తాజాగా, గుజరాత్‌ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. 

దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్‌ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది. 

 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)