Video: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు.. ఆమెకు ముద్దు పెట్టి!

Published on Tue, 01/10/2023 - 16:45

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇటీవల కాలంలో వివాహాలు.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. ఆటలు, పాటలు,స్టెప్పులతో చాలా సరాదగా జరుపుకుంటున్నారు. పెళ్లిలో చిన్న చిన్న చిలిపి పనులు, ఫన్నీ మూమెంట్స్‌ లేకుంటే సరదా ఏముంటుంది చెప్పండి. అప్పుడ‌ప్పుడు ఈ వేడుకల్లో కొన్ని చిత్ర విచిత్ర ఘ‌ట‌న‌లు కూడా చోటుచేసుకుంటాయి. ఇక ఇప్పటికే సోషల్‌ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నెట్టింట్ వైర‌ల్‌గా మారింది. పెళ్లి తర్వాత ఎలాగూ బరువు బాధ్యతలు తప్పవనుకున్నాడో ఏమో గానీ ఓ వరుడు వివాహం అనంతరం భార్యను చేతుల్తో ఎత్తుకొని స్టేజ్‌ నుంచి కిందకు వచ్చాడు. వధువును ఎత్తుకొని వేదిక మెట్లు దిగుతుండగా వరుడు జారి కిందపడిపోయాడు. కానీ వధువును మాత్రం కింద పడిపోకుండా తన చేతుల్లోనే గట్టిగా పట్టుకున్నాడు.

అయితే కిందపడినప్పటికీ పెళ్లి కొడుకు ఏమాత్రం అవమానకరంగా, ఇబ్బందిగా ఫీల్‌ అవ్వలేదు. వెంటనే అతను లేచి నిలబడి నవ్వుతూ భార్యను ముద్దుపెట్టుకొని ఆమెను ఓదార్చాడు. అంతేగాక ఏం పర్వాలేదు.. ఇలాంటి జరుగుతుంటాయి అంటూ ఆమెలో ఉత్సాహాన్ని నింపాడు. జోయా జాన్‌ అనే అనే యూజర్‌ దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 
చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)