Breaking News

ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ!

Published on Sun, 02/26/2023 - 11:20

ఇటీవల పెళ్లి వేడుకల వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు వధువు దగ్గర నుంచి వరుడు వరకు పాటించే ఆచారాలు ఎవరో ఒకరు చిత్రీకరించడంతో అవి నెట్టింట వైరల్‌గా మారడం షరా మామూలుగా మారింది. ఈ ట్రెండ్‌ కరోనా నుంచి కాస్త ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. తాజాగా ఓ వరుడు ఊరేగింపులో రూ. కోట్లు విలువైన లగ్జరీ కార్లను ఉపయోగించాడు. అయితే కార్ల నుంచి కాకుండా మండపంలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్‌ ఇచ్చాడు ఆ వరడు! 

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భాజపా నేత భరత్‌ వఘాశియా తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. అందులో అత్యంత ఖరీదైన కార్ల సరికొత్త మోడల్స్ అన్నీ కనిపించాయి. ఊరేగింపులో ఖరీదైన కార్లు రావడం చూసి పెళ్లికి వచ్చి బంధువులు, చుట్టూ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ, ఆ వరుడు ఊరేగింపులో ఉన్న లగ్జరీ కార్లలో కాకుండా ఎద్దుల బండిపై వచ్చి ఊహించని షాకిచ్చాడు. కారణం ఏంటంటే.. గుజరాత్‌లో వరుడు ఎప్పుడూ ఎద్దుల బండిలో రావడం అనాదిగా వస్తున్న ఆచారం. గుజరాత్ సంస్కృతి ,సంప్రదాయాలతో పాటు ఆధునిక, సాంకేతికతతో నడిచే జీవనశైలిని ప్రదర్శించాలని వరుడు కోరుకున్నాడట.  తన కుమారుడికి ఖరీదైన కార్లంటే ఇష్టమని, అందుకే ఊరేగింపులో రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన కార్లను ఉపయోగించామని, అలాగే సంప్రదాయాన్నీ కొనసాగించినట్లు వరుడు తండ్రి తెలిపాడు.

చదవండి   వెరైటీ వంట: ప్లాస్టిక్‌ కవర్‌లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!

Videos

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)