Breaking News

ఓ.. పరదేశి!

Published on Wed, 02/05/2025 - 09:06

తమిళనాడు: యుద్ధంతో అట్టుడుకున్న ఉక్రెయిన్‌(Ukraine) దేశ యువతిని విల్లుపురం యువకుడు ప్రేమించి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. విల్లుపురానికి చెందిన జయకుమార్‌ కుమారుడు ఉదయకుమార్‌ (30). ఇతను కోవైలో బీఈ చదువు పూర్తి చేసి ఆరు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం స్లోవేకియా దేశానికి వెళ్లారు. అక్కడ రెండేళ్లు చదువు పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 

అక్కడ తనతో పాటూ ఉద్యోగం చేస్తున్న ఉక్రెయిన్‌ దేశానికి చెందిన అనస్టాసియా (25)ను ప్రేమించాడు. తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని భావించగా, ఇరు కుటుంబీకులు అందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో ఆ దేశం నుంచి సొంత ఊరికి వచ్చిన ప్రేమ జంటకు సోమవారం విల్లుపురం సమీపంలో కంబియంపులియూర్‌ పెరుమాల్‌ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.  

అమెరికా అమ్మాయితో..


అదేవిధంగా తిరువన్నామలై జిల్లా చెయ్యారు తాలూకా అనక్కావూరుకు చెందిన భాస్కరన్‌ అమెరికాలోని ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య ఆదిరై, ఇద్దరు కుమారులతో టెక్సాస్‌లో నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు అవి నాష్‌ నాసాలో సైంటిస్ట్‌గా ఉన్నారు. ఈయన ఆ ప్రాంతానికి చెందిన కేథరిన్‌ ఓసేవి అనే యువతిని ప్రేమించారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబీకులు సమ్మతించడంతో విల్లుపురం జిల్లా సెంజిలో ఉన్న కులదేవత ఏకాంభరేశ్వరర్‌ ఆలయంలో, తమిళ సాంప్రదాయం ప్రకారం కనులపండువగా వీరి వివాహ వేడుక మంగళవారం  సాగింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)