టీవీకే మెజార్టీ కోసం విజయ్‌ భారీ స్కెచ్‌..?

Published on Sun, 07/12/2026 - 19:54

సాక్షి, చెన్నై: తమిళనాడులో విజయ్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి అక్కడి ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కులుకు లేకుండా పోతుంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడ టీవీకే తీర్థం పుచ్చుకుంటారా అని అక్కడి పార్టీలు హైరానా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ మరో భారీ స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేలా పావులు కదుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వార్తలు ప్రచురిస్తున్నాయి.

తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన టీవీకే ఏకంగా 107 సీట్లు సాధించి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ రిజల్ట్‌ చూసిన రాజకీయా విశ్లేషకులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ తర్వాత అధికారం కోసం జరిగిన హైడ్రామా సైతం సినిమా ఎపిసోడ్‌ను తలపించింది. అక్కడి కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న చిన్న పార్టీల సహాకారంతో జోసెఫ్‌ విజయ్‌ ప్రమాణ స్వీకారం చేయడంతో సీఎం హైడ్రామాకు ఫులిస్టాప్‌ పడింది. 

అయితే సీఎం కావడంలో ఎదుర్కొన్నఇబ్బందుల్ని సీఎం విజయ్‌ ఇంకా మర్చిపోనున్నట్లు తెలుస్తోంది. అందుకే టీవీకే స్వంతంగా మెజార్టీ మార్కు దాటేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏఐడీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో చేరేలా టీవీకే సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఆగస్టు 15లోపు వీరు పార్టీలో చేరతారని అనంతరం టీవీకే తరపున ఉపఎన్నికల్లో పోటీ చేస్తారని కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ "ఆపరేషన్‌ ఎల్‌" అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా ఇదివరకే నలుగురు ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో అధికారికంగా చేరారు. దానితో పాటు మే 13న జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో టీవీకేకు మద్ధతుగా ఏఐడీఎకే రెబల్ గ్రూప్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో మరో పదిమందిని పార్టీలో చేర్చుకొని ఉపఎన్నికలకు వెళ్లేలా విజయ్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తమిళనాట మరోసారి పొలిటికల్ హీట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)