Breaking News

తమిళనాడుకు ఏ డబ్బా ఇంజిన్లు అక్కర్లేదు: విజయ్‌

Published on Mon, 02/02/2026 - 14:11

అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ లొంగిపోయే రకం కాదని.. డబ్బుతో తనను ఎవరూ కొనలేరని అన్నారు. తమిళనాడులో టీవీకే మాత్రమే టాప్‌ ఇంజిన్‌ అని.. ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ తమిళనాడు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

సోమవారం టీవీకే మూడో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్‌ మాట్లాడుతూ.. తమిళ రాజకీయాల్లో విజిల్‌ సౌండ్‌ గట్టిగా ఉంటుందన్నారు. టీవీకే టాప్‌ ఇంజిన్‌ అని.. కాబట్టి ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ పరోక్షంగా బీజేపీ-అన్నాడీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రసంగం ఆద్యంతంలో అన్నాడీఎంకే పేరును ప్రస్తావించకుండానే ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం. 

ఇక డీఎంకేపైనా ఆయన నేరుగా విమర్శలు చేయలేదు. ప్రముఖ కవి తిరువళ్లువర్‌ ఇవాళ జీవించి ఉంటే ఈ పాలన(డీఎంకే) చూసి.. తిరుక్కురల్‌ను తిరగరాసి ఉండేవారేమో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. స్టాలిన్‌ను అడిగినా.. విజిల్‌ గుర్తుకే ఓటేస్తారని ఛలోక్తులు విసిరారు. విజయ్‌ వ్యాఖ్యలతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చినట్లేనని.. ఒంటరి పోరే ఉంటుందని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి.  

అభిమానుల కోసం మూడు స్టెప్పులు..
టీవీకే వార్షికోత్సవ కార్యక్రమంలో విజయ్‌ హుషారుగా కనిపించారు. జన నాయగన్‌ తన చివరి చిత్రం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఆయన సినిమాకు నెలకొన్న సెన్సార్‌-రిలీజ్‌ కష్టాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో.. సింగర్‌ వేలుమరుగన్‌ పాడిన పాటకు చిన్నారులతో కలిసి విజయ్‌ చిందులేసి అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)