Breaking News

Vijay Diwas: బంగ్లాదేశ్‌ ఆవిర్భవించిన రోజు.. భారత్‌కు ఎందుకు ప్రత్యేకం?

Published on Mon, 12/16/2024 - 10:00

దేశమంతా ఈరోజు (డిసెంబరు 16) విజయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1971లో  ఇదే రోజున భారత్‌ యుద్ధంలో పాక్‌ సైన్యాన్ని మట్టికరిపించింది. అలాగే తూర్పు పాకిస్తాన్‌ను అణచివేత నుండి విముక్తి చేసింది. ఈ రోజు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైనది. పాక్‌పై యద్ధంలో గెలిచినందుకు గుర్తుగా భారత సాయుధ బలగాల త్యాగాలను ఈరోజు గుర్తుచేసుకుంటారు.

నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో..
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో బెంగాలీ జాతీయవాద సమూహానికి భారత్‌ మద్దతుపలికింది. ఈ నేపధ్యంలో తూర్పు పాకిస్తాన్‌లో భారత్‌.. పాక్‌తో యుద్ధం చేసింది. అంతిమంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. 1970-71లలో పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ తన అణచివేత సైనిక పాలనతో తూర్పు పాకిస్తాన్‌లోని సామాన్యులను ఊచకోతకు గురిచేశారు. ఈ నేపధ్యంలో షేక్ ముజిబుర్ రెహమాన్ సామాన్యులను పోరాటం దిశగా ప్రేరేపించేందుకు ముక్తి బాహినీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ పోరాటానికి భారత్ నుంచి సహాయం కూడా కోరారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ప్రజలను పాక్‌ అరాచకాల నుంచి రక్షించేందుకు భారత సైన్యాన్ని పాక్‌తో యుద్ధానికి అనుమతించారు.

అతిపెద్ద సైనిక లొంగుబాటు
భారత సైన్యం 1971, డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్‌ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం ఇచ్చింది. దీంతో 1971, డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరోమార్గంలేక  అతను అందుకు తలొగ్గాడు. ఈ  యుద్ధకాలంలో 93 వేలమంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. 

ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)