Breaking News

Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..

Published on Mon, 12/16/2024 - 11:56

అది 1971, డిసెంబర్ 16.. భారతదేశ చరిత్ర పుటల్లో గర్వకారణంగా నిలిచిన రోజు. ఆ రోజున భారతదేశం యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోరమైన ఓటమి ఎలా ఉంటుందో చూపింది. నాటి యుద్ధంలో సుమారు 3,900 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా, 9,851 మంది గాయపడ్డారు. యుద్ధం అనంతరం 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఈ నేపధ్యంలోనే తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.

నాటి యుద్ధంలో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన పలువురు వీర సైనికులు పాకిస్తాన్ సేనను ధైర్యంగా ఎదుర్కొని, వారిని మట్టికరిపించారు. ప్రతీయేటా డిసెంబర్ 16 రాగానే.. నాటి యుద్ధంలో పాల్గొని, పాక్ సైనికులను ఓడించిన వీర జవాన్లకు నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.

నాటి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను యుద్ధం ప్రారంభమైనప్పుడు లక్నోలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పని చేశాను. నాడు నన్ను బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ మా ఎనిమిది మంది సైనికుల బృందం పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలువురు పాకిస్తానీ సైనికులు మరణించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మేము స్పృహ కోల్పోయాం. నేను చనిపోయానని సైన్యం భావించి, మా ఇంటికి టెలిగ్రామ్ పంపింది. అయితే ఆ తర్వాత నేను స్పృహలోకి రాగానే, నేను బతికే ఉన్నానంటూ మా ఇంటిలోనివారికి సైన్యం తిరిగి మరో సందేశం పంపింది’ అని తెలిపారు.

మరో సైనికుడు తన యుద్ధ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ‘యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఢాకాలో ఉన్నాను. రాత్రంతా వైర్‌లెస్ బ్యాటరీని ఛార్జ్ చేసేవాడిని. కరెంటు లేకపోవడంతో జనరేటర్‌తో పని చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మేము నిత్యం అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ సైనికులు ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భావనతో ఉండేవాళ్లం’ అని తెలిపారు. నాడు భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం అందరికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. నాటి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైనికులకు ప్రతి ఏటా డిసెంబర్ 16న  దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.

ఇది కూడా చదవండి: Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు..

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)