Breaking News

టికెట్లకు రూ.4 లక్షలు.. ఎయిర్‌ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం

Published on Sat, 01/06/2024 - 19:37

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుంది. సాంకేతిక లోపాలు, ప్రయాణికుల చేష్టలు, ఎమర్జెన్సీ ల్యాండిగ్‌ వంటి వివిధ తప్పిదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా తన కుటుంబంతో కలిసి సంతోషంగా ప్రయాణించాలనుకున్న ఓ మహిళకు ఎయిర్‌ ఇండియా విమానంలో చేదు అనుభవం ఎదురైంది. రూ. 4.50 లక్షలు పెట్టి టికెట్లు కొని ప్రయాణిస్తే.. విమానయాన సంస్థ సౌకర్యాలు చూసి షాకైంది. తనకు ఎదరైన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.

ఇటీవల శ్రేతి గార్గ్‌ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ నుంచి టొరొంటోకు ఎయిర్‌ ఇండియా విమానంలో బయలు దేరింది. తన ప్రయాణంలో ఆమె అనేక సమస్యలను ఎదుర్కొంది. తమకు కేటాయించిన సీట్ల హ్యాండిల్స్‌ విరిగిపోయి వైర్లు బయటకి వచ్చి ఉన్నాయని, ఎదురుగా ఉన్న స్క్రీన్లు  సైతం పని చేయలేదని తెలిపింది. సిబ్బంది వాటిని రీబూట్‌ చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది.

ఇవన్నీ చాలవన్నట్టు ఓవర్ హెడ్ లైట్లు పని చేయలేదు. దీంతో ఆమె తన చిన్నారులతో చీకట్లో గడపాల్సి వచ్చింది. వెలుతురు కోసం తన ఫోన్‌ టార్చ్‌లైట్‌ను ఉపయోగించింది. అయితే టిక్కెట్ల కోసం రూ.4.5 లక్షలు చెల్లించినప్పటికీ, నాసిరకం సేవలు అందించడంపై సదరు మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.  

‘ఎయిర్‌ ఇండియాలో ముందుగానే టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రయాణికుల జర్నీని సాఫీగా సాగేలా చేయకుండా.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మాలాంటి తల్లిదండ్రులకు అసౌకర్యంగా ఫీల్‌ అయ్యేలా చేశారు. తెగిన వైర్ల కారణంగా మా చిన్నారుల రక్షణపై ఆందోళన చెందాం. ఈ జర్నీ మాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మూడు మిలియన్ల వ్యూస్‌ లభించాయి. ఆమె పోస్ట్‌పై ఎయిర్‌ ఇండియా స్పందించలేదు.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)