Breaking News

Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం

Published on Wed, 12/27/2023 - 14:47

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్‌లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్‌ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్‌ చేశారు. 

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది  ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్‌ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహ‌న‌దారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్ల‌ను ఎత్తుకెళ్ల‌కుండా ట్ర‌క్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది.

కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్‌ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు  తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్ర‌క్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)