Breaking News

Bengaluru: కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు, ఎందుకంటే!

Published on Thu, 10/24/2024 - 14:12

బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ అంటూ వాహనదారులు భయపడిపోతూ ఉంటారు. కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని సగం జీవితం రోడ్డుపైనే గడపాల్సి వస్తుందంటూ తరచూ నగరవాసులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. అదే వర్షాలు కురిసి వరద నీటితో రోడ్లు అన్నీ నిండిపోయిన సందర్భంలో ఏర్పడే ట్రాఫిక్‌ గురించి ఇక చెప్పనవసరం లేదు.

తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై భారీగా జామ్‌ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయిన పరిస్థితి తలెత్తింది. దీంతో విసుగుచెందిన కొందరు తమ కాళ్లకు పని చెప్పారు. వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)